సరికొత్త ప్రణాళికతో ఓంకార్... సక్సెస్ సాధిస్తాడా?

VAMSI
స్టార్ మా టివిలో బాగా పాపులర్ అయిన షోస్ లో 'ఇస్మార్ట్ జోడి' కూడా ఒకటి. ఈ షో ను ముందుండి నడిపించారు ఓంకార్. బుల్లి తెరపై విభిన్నమైన షోలను నడిపించడంలో వాటిని సక్సెస్ బాట పట్టించడంలో ఓంకార్ పెట్టింది పేరు. మా టీవిలో పలు షోలతో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఈ యాంకర్ సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడి, వంటి షోలతో మరింత గుర్తింపు పొందారు. బిగ్ బాస్ షో అయిపోతుంది అంటే ఇక ఓంకార్ బాస్ రంగంలోకి దిగి ప్రేక్షకులను సరికొత్త షోలతో అలరిస్తూ ఉంటారు. పోయిన సారి ఇస్మార్ట్ జోడి అంటూ ఒక కొత్త ప్రోగ్రామ్ తో రాగా అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ షురూ అయిన విషయం తెలిసిందే.
ఇపుడు బిగ్ బాస్ సీజన్ 5 ముగియడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకు ఇస్మార్ట్ జోడి సీజన్ 2 తో వచ్చేస్తున్నారు ఓంకార్. కాగా సీజన్ వన్ లో రియల్ కపుల్స్ తో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతో ప్రయత్నించారు ఓంకార్ అండ్ టీమ్. కానీ ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేదని చెప్పాలి. టి ఆర్ పి రేటింగ్స్ కూడా చాలా బాగా తగ్గాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఈ సారి సరి కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట ఓంకార్. కొద్ది రోజుల నుండి ఈ షో కు సంబంధించిన ప్రోమో కూడా బాగా హైలైట్ అవుతోంది.
సీజన్ కాన్సెప్ట్ ను మార్చకుండా లో లోపల కొన్ని కంటెంట్ ను మార్చుతున్నారని తెలుస్తోంది. అయితే ఇది కూడా కేవలం రెండు నెలల వరకు మాత్రమే ప్రసారం కానుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ కానుంది.
మరి చూద్దాం ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: