టీవీ: నటి పూజితను చంపాలని చూసిందెవరో తెలుసా..?

Divya
ఆడవాళ్ళు ఎవరైనా సరే భర్తతో బాగా సంతోషంగా గడపాలని చూస్తూ ఉంటారు.. కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకునే నటి తన భర్త వల్ల తానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది. ఆమె ఎవరో కాదు నటి పూజిత. ఈ నటి వాళ్ళ అమ్మానాన్నలు కూడా తన భర్త నుఎంతో బాగా చూసుకున్నారట, కానీ అతను వీళ్ళందర్నీ వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని తెలియజేసింది. అలా వెళ్ళిపోయి వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. ఇక పూజిత వాళ్ళ అత్తమామలు తన దగ్గరికి వచ్చి.. ఆ పెళ్లి ఆపమని తెలియజేశారట. అక్కడికి వెళ్లి పూజితకు తన భర్త డైవర్స్ పేపర్స్ ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని తెలియజేసారట.
ఇక ఆ పెళ్ళి కేవలం ఈమె చేతుల్లోనే ఆపే అవకాశం ఉందని ఆమె తల్లదండ్రులు చెప్పారంట. ఇక ఆ తర్వాత పూజిత.. అత్తామామలు తన కుమారులు దగ్గరనుంచి వదిలిపెట్టి.. బయట ఉండమని తెలియజేశారట. కానీ తన భర్త పై కంప్లైంట్ చేయమని ఆమె అత్తామామలు కాళ్లు పట్టుకునే సరికి ఆమె సైన్ చేసినట్లు తెలియజేసింది. ఇక ఆ తర్వాత ఆమె ఆడవాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడేది కాదట. మహిళలంటే  ఒక శత్రువు గా చూసే దాన్ని తెలిసిందట.
ఇక తన భర్తతో ఏడు సంవత్సరాలు ఉన్నానని.. అది కూడా తన భర్త తనను ఒకే రూమ్ లోనే ఉంచేవారని తెలియజేసింది.. ఈ విషయాలన్నీ పూజిత తల్లిదండ్రులకు తెలిస్తే తలఒంపులని.. భావించి ఈ విషయాన్ని ఎక్కడా తెలియజేయ లేదట. కానీ చివరికి ఎట్టకేలకు పూజిత తల్లిదండ్రులు తెలుసుకున్నప్పటికీ వారిని రావద్దని కరాఖండిగా తెలియజేసిందట. తన భర్త ఒక మూర్ఖుడని.. తనకి సినీ అవకాశాలు రాకుండా చేశారని, ఒకసారి తనని చంపేందుకు ఎత్తుకెళ్లినప్పుడు ఆమె తప్పించుకుని వచ్చానని తెలియజేసింది. ఆ టైం లో మా అసోసియేషన్ ని సంప్రదించగా ఎవరూ తనకు సహాయం చేయలేదు అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: