
బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?
ఇక ఉన్న ఇద్దరిలో కూడా ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నారు అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అది కూడా కాజల్ అని గట్టిగా వినబడుతోంది. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది కాజల్ అని దాదాపు కన్ఫర్మ్ అయినట్లే చెబుతున్నారు. ఇక మిగిలిన ఐదుగురు టాప్ ఫైవ్ లో టైటిల్ కోసం పోటీ పడనున్నారు అని అవగతమవుతోంది. అలా లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజున అయిదుగురు నుండి మొదటగా సిరి, మానస్ లు ఎలిమినేట్ కానున్నారు అట. మిగిలిన ముగ్గురు సన్ని, శ్రీ రామ చంద్ర, షన్ను లలో చివరికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా నిలిచేది సన్నినే అంటూ మెజారిటీ సర్వేలు అంటున్నాయి.
అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఇలా జరగొచ్చు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న లీకుల ప్రకారమే బిగ్ బాస్ విజేతను నిర్ణయిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరి అధికారికంగా ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వెయిట్ చేయాల్సిందే.