బిగ్ బాస్ 5: సిరి టాప్ 5 లో కష్టమే... షణ్ముఖ్ ఎఫెక్ట్ పడిందా?

VAMSI
ఎంతో ఉత్కంఠ భరితంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అనదరి దృష్టి టాప్ ఫైవ్ కి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఎవరు అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎవరు హైలెట్ అయ్యి తమ ఓట్ల గ్రాఫ్ పెంచుకుంటారో చెప్పలేం. ప్రస్తుత సమాచారం ప్రకారం టాప్ లో సన్ని పేరు ఎక్కువగా విపిస్తుండగా...మిగిలిన టాప్ ఫైవ్ లిస్ట్ లోని నలుగురి పేర్లు, స్థానాలు పలు సార్లు మారుతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి శ్రీ రామ్ రెండో స్థానంలో ఉంటుండగా, మరోసారి రవి పేరు ఇంకొన్ని సార్లు షణ్ముఖ్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు సో సో అనుకున్న కాజల్ పేరు ఇపుడు టాప్ ఫైవ్ లిస్ట్ లో వినిపిస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా కాజల్ పర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఉంటోంది.
అదే కాక కాస్త మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ..తన గేమ్ స్ట్రాటజీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అలా గత వారం ఓ సర్వే ప్రకారం టాప్ ఫైవ్ లో లేని కాజల్ పేరు ఇపుడు వినిపిస్తుండగా దానికి కారణాలు ఇవి అని తెలుస్తున్నాయి. ఇక అటు తిరిగి ఇటు తిరిగి టార్గెట్ పాయింట్ పాపం ప్రియాంక సింగ్ అవుతోంది. ఆ తర్వాత మానస్ పేరు వినిపిస్తోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కాజల్ అని గట్టిగా వినిపించగా ఇపుడు ఆ అంచనాలు తారుమారయ్యాయి. అంతేకాకుండా సిరి కూడా షణ్ముఖ్ తోనే బాగా అటాచ్ కావడం వలన గేమ్ కాస్తా పూర్తిగా మరిచిపోయినట్టు అనిపిస్తోంది.
ప్రస్తుతం సిరి పై ప్రేక్షకుల్లో ఉన్న వ్యతిరేకతకు టాప్ 5 లో కాదు కదా, ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటే చాలు అని అంటున్నారు నెటిజన్లు. నిన్న మొన్న హౌస్ లోకి వచ్చిన సిరి అమ్మ మరియు షణ్ముఖ్ అమ్మ ఇద్దరినీ ఈ విషయమై సూటిగా ప్రశ్నించారు. మీరు ఎందుకు ఇక్కడకి వచ్చారు, ఏమి చేస్తున్నారు అంటూ అడిగారు. దీనితో షణ్ముఖ్ సిరి ఇద్దరికీ తల తీసేసినట్లయింది.  మరి పూర్తి క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: