బిగ్ బాస్ 5: కౌశల్ లాగా సన్నీని టార్గెట్ చేస్తున్నారా?

VAMSI
నిన్నటి ఎపిసోడ్ లో ఇంటిసభ్యులకు నాగ్ తిట్ల అక్షింతలు బాగానే వేశారు. ఇక సన్ని కైతే అంక్షింతలు ఏకంగా కుమ్మరించేసారనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే...ఇంటి సభ్యుల ఫోటోలు పట్టుకుని పక్కనే క్రషింగ్ మెషిన్ పెట్టుకుని వచ్చేశారు నాగ్. ఒక్కో ఫోటో అందులో వేస్తూ వారి చేసిన తప్పుల గురించి షంటింగ్ ఇస్తూ వచ్చారు. అయితే జెస్సీ విషయం వచ్చే సరికి అతడు గేమ్ లో గివప్ ఇచ్చినందుకు కాస్త గట్టిగా చెప్పారే కానీ, సంచాలక్ గా మాత్రం తను నిన్నటి టాస్క్ లో చేసింది రైట్ లేక రాంగ్ అన్నది విశ్లేషించలేదు. ఇక సన్ని ఫోటో ను తీసుకున్న నాగ్ మెషిన్ లో వేయక ముందే ముక్కలు ముక్కలుగా చింపేసి ఆ తరవాత అందులో వేశారు. నువ్వు అలా జెస్సీ మీద మీదకు వెళ్లి మాట్లాడటం చాలా తప్పు అంటూ నిప్పులు కురిపించాడు.
అక్కడ వరకు బాగానే ఉంది..సన్ని చేసింది తప్పే..కానీ శ్రీ రామ్, జెస్సీ లు కలిసి తనని కావాలనే రెచ్చగొట్టారు అని చెబుతున్నా నాగ్ పట్టించుకోలేదు. టాస్క్ సమయంలో తను, శ్రీ రామ్ సర్కిల్ బయటకు వచ్చి పడిపోతే తనని ఒక్కటే ఎలిమినేట్ చేశాడు జెస్సీ. రామ్ ని ఎందుకు చేయవు అంటే, అందులోనూ నువ్వే కాలు కదపలేదు అంటూ ఏవో కబుర్లు చెప్పాడు. అదే మళ్ళీ శ్రీ రామ్, మానస్ లు బయటకు వచ్చి పడిపోతే ...రామ్ పూర్తిగా ఆగిపోయాడు, మానస్ మూవింగ్ లోనే ఉన్నాడు అయినా ఇద్దర్నీ ఎలిమినేట్ అంటూ కావాలనే మానస్ ను టార్గెట్ చేశారు సార్ అందుకే చాలా బాధ అనిపించింది, కంట్రోల్ చేసుకోలేకపోయాను. జెస్సీ ఎలా కరెక్ట్ సార్ అని నాగ్ కి సన్ని సవినయంగా వివరించినా నాగ్ సంచలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ, నువ్వు చేసిందే తప్పు అంటూ మేటర్ క్లోజ్ చేశారు నాగ్.
అయితే ఇక్కడ  ఈ విషయం మాత్రం చాలామంది ప్రేక్షకులకి ఫేర్ అనిపించలేదు. సంచాలక్ ఏమి చేసినా కరెక్టేనా..నిజానికి జెస్సీ అక్కడ చేసింది తప్పని తెలుస్తోంది. అయినా అతడిని ఏమీ అనకపోవడం కేవలం సన్ని ని మాత్రమే నాగ్ నిందించడం చాలామందికి నచ్చలేదని అంటున్నారు. మరి గతంలో కౌశల్ లాగే ఇక్కడ సన్నిని కూడా అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఆలోచన ఇప్పటికే ప్రజల్లో మొదలై పోయింది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: