బిగ్ బాస్ తెలుగు లో లీకులు కామన్ అయిపోయాయి. నామినేషన్స్.. కెప్టెన్సీ.. ఎలిమినేషన్ ఇలా అన్ని విషయాలు ముందే లీక్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8వ వారం నామినేషన్ లోకి ఎవరెవరు వచ్చారు అన్నది కూడా లీక్ అయ్యింది. లీకు రాయుళ్లు చెబుతున్న వివరాల ప్రకారం... ప్రియా శైలజ ఎలిమినేషన్ తర్వాత ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేషన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం హౌస్ లో 12 మంది సభ్యులు ఉండగా వారిలో ఆరుగురు నామినేషన్ లోకి వచ్చినట్టు సమాచారం.
యాంకర్ రవి, లోబో, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్, శ్రీరామ్ లు ఈ వారం నామినేషన్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది మాత్రమే... ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ రోజు రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కాకుండా ముందుగా వచ్చిన ప్రతి సీజన్ లో మొదటివారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలివేషన్ అవ్వడం ఆనవాయితీగా వస్తే ఈ సీజన్ లో మాత్రం ప్రియా శైలజ ఆరు వారాల పాటు ఇంట్లో ఉండి ఏడో వారం ఎలిమినేట్ అయింది.
అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదటివారం బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయ్యింది . సరయు ఎలిమినేషన్ అందర్నీ షాక్ గురి చేసింది కూడా. ఇక వరుసగా రెండవ వారం ఉమాదేవి ఎలిమినేషన్ అవ్వగా..నాలగోవారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం హమీద ఎలిమినేట్ కాగా ఆరో వారం స్వేతా వర్మా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరి ఏడో వారం ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి. ఇక ఇప్పటికే కొంతమంది ఇంటి సభ్యులపై అనుమానాలు ఉన్నప్పటికీ విశ్లేషణలు ఎప్పటికప్పుడు ఇంటి సభ్యుల ప్రవర్తనను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియాలంటే ఈ వారం పూర్తయ్యే వరకు చూడాల్సిందే.