
బిగ్ బాస్ 5: బిగ్ బాస్ మహిళలనే టార్గెట్ చేస్తున్నాడా?
అలా చూస్తే బిగ్ సీజన్ 5 విజేత ఎవరు అన్న ప్రశ్న వేస్తే...మొదట శ్రీ రామ్, సన్ని, రవి ల పేర్లు వినిపిస్తుండగా ఆ తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ లో యాని మాస్టర్ ఇంకా మానస్ ల పేర్లు విపిస్తున్నాయి. మరి సీజన్ 5 విన్నర్ ఎవరన్న విషయంపై ఓ క్లారిటీ రావాలంటే ఇంకో మూడు, నాలుగు వారాలు గడవాల్సిందే. ఈ విషయం అలా ఉంచితే నిన్న ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటకు వెళ్లిన ప్రియ నటిగా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితురాలే. ఇక ఈమె రియల్ లైఫ్ విషయానికి వస్తే...ఈమె సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు. 1997 సంవత్సరం లో జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన "దొంగాట" చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు ప్రియ.
ఇక అప్పటి నుండి ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో నటిస్తూ అవకాశాలను అందుకుంటున్నారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి హీరోల చిత్రాలలో ఈమె ప్రముఖ పాత్రలు పోషించారు. హిందీలోనూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 60 కు పైగా సినిమాల్లో నటించారు ప్రియ. ఈమె అసలు పేరు శైలజ ప్రియ.