బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ జరిగేది ఓటింగ్ వల్ల కాదట...?
ఇది మనకు తెలిసిన ఓటింగ్ శాతం ను బట్టి ఊహిస్తున్నారు. అయితే లోబో ఇంటిలో కొంతలో కొంతైనా ఎంటర్ టైన్మెంట్ ఇస్తుండటంతో లోబో సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువట, ఇక మిగిలిన విశ్వ మరియు జస్వంత్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ విధానం గురించి ఒక కీలక విషయం బయటపడింది. అందరూ ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు ఇంటి సభ్యులకు పడిన ఓట్ల వల్ల ఎలిమినేషన్ చేయడం లేదట... ఇంటి సభ్యులకు నిర్దేశించిన ఫోన్ నంబర్ కు ఇచ్చిన మిస్ కాల్ ను ఆధారంగా చేసుకుని ఎలిమినేట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ వారంలో మీకు నచ్చిన ఇంటి సభ్యుని సేవ్ చేయడానికి మిస్ కాల్ ఇచ్చే అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంది. మరి గత వారం కూడా లీక్ ల ఆధారంగా ఎలిమినేషన్ జరగలేదు. అదే విధంగా ఈసారి కూడా బిగ్ బాస్ ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి.