టీవీ: దేవత సీరియల్ నటి రమ్య గురించి ఈ విషయాలు తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇందులో నటించే నటులు తమ నటనతో పాటు దర్శకులు కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ..పోటీ పడుతున్నారు.. అసలే పోటీ ప్రపంచం.. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు సరికొత్తధనాన్ని కోరుకుంటారు.. అందుకే వీరందరినీ దృష్టిలో దర్శక రచయితలు కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త కథలను తయారు చేస్తూ.. వీరు రాసుకున్న పాత్రలకు సరైన వారిని పాత్రలలో ప్రేక్షకులకు చూపిస్తూ, బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. వీరి కథల పాత్రలకు ప్రాణం పోస్తూ నటీనటులు కూడా ఎంతో చక్కగా నటిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.

ఇక అలాంటి ఎన్నో సీరియల్స్ లో మంచి గుర్తింపు పొందుతున్న సీరియల్ దేవత. ఈ సీరియల్లో ఎంతోమంది నటీనటులు తమదైన శైలిలో నటిస్తూ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న రమ్య గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.. అందం అభినయంతో పాటు చూడచక్కని మోముతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక రమ్య అసలు పేరు మేఘన ఖుషి. ఈమె కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నవంబర్ 23 వ తేదీ న జన్మించింది.

మేఘన కి ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే , జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసి.. నటిగా మారాలని అనుకుంది. ఇక  ఈమె చిన్నతనం నుంచి నటన పట్ల, డాన్స్ పట్ల ఈమె ఎక్కువ మక్కువ ఏర్పరచుకుంది. అందరిలాగే చదువు పూర్తయ్యాక మోడలింగ్ విభాగం లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట మోడలింగ్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న రమ్య, కన్నడలో యాంకరింగ్ చేసే ఛాన్స్ ను కూడా  కొట్టేసింది. కన్నడలో  సెవలు, ఆరాగ్ని  వంటి సీరియల్స్ తో పాటు సినిమాల లో కూడా  నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్ ద్వారా  మేఘన తెలుగు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కస్తూరి, దేవత వంటి  సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఒక మంచి  ఇమేజ్  ను సొంతం చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: