బిగ్ బాస్ 5: వారిద్దరి విషయంలో సరయు చెప్పింది నిజమేనా?

VAMSI
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు పాపులారిటీ పెంచుకుంటోంది. పూట పూటకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య జరిగే వివాదాలు, ప్రేమాయణాలు, సెంటిమెంట్, విమర్శలు... ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ సెంటిమెంట్ డోస్ కాస్త ఎక్కువైందని చెప్పాలి. సిరి తన బాధ చెప్పుకొంది. షణ్ముఖ్ ఈమధ్య తనతో మాట్లాడటం మానేశాడు అని, పలకరించినా పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోయింది. షణ్ముఖ్ మాట్లాడకపోతే అసలు ఏమీ తోచదంటూ చాలా బాధగా ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపు తరవాత జస్వంత్, షణ్ముఖ్ లు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు  సిరి అలా వెలుతుండగా...జస్వంత్ సిరిని దగ్గరకు పిలిచి రా ఇలా కూర్చో అంటే సిరి షణ్ముక్ పక్కన కూర్చోకుండా కింద కూర్చుంటుంది.
జస్వంత్ ఏంటి మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అని వారిద్దరి చేతులు కలపబోతోంటే సిరి దూరంగా జరుగుతుంది. అపుడు జస్వంత్ ..షణ్ముఖ్ నువ్వే లేచి సిరికి హగ్ ఇచ్చి మాట్లాడు అంటుండగా వెంటనే షణ్ముక్ ఆ తర్వాత ముద్దు కూడా ఇవ్వమనురా అని సడెన్ గా అనేశాడు. ఇది విన్న ప్రేక్షకులు ఏంటి ఇది నిజంగానే షణ్ముఖ్ లో ఇంత మాటల నేర్పరి తనం ఉందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే షణ్ముక్ అంత మాట సిరిని ఎందుకు అన్నాడు...నిజంగానే సరయు చెప్పినట్లు వీరి మధ్య ఏమైనా ఉందా...బాగా మాట్లాడుకొనే ఒక ప్లానింగ్ తోనే హౌస్ లోకి ఎంటరయ్యారా అనిపిస్తోంది.
ఇకపోతే అనంతరం హౌస్ లో స్విమ్ జర స్విమ్ అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఇది కెప్టెన్సీ టాస్క్....శ్వేత వర్మ, రవి, జస్వంత్, శ్రీ రామ్ చంద్ర లు పోటీదారులుగా పాల్గొన్నారు. పూల్ లో అల్ఫాబెట్స్ ఉంటాయి. బయట ఒక్కొకరి టేబుల్ వద్ద కెప్టెన్ అనే వర్డ్ రాసి ఉంటుంది..అయితే ఆ లెటర్ సైజ్ కి తగ్గ అల్ఫాబెట్ ను వెతికి తీసుకొచ్చి సెట్ చేయాలి. ఎవరైతే ముందుగా వర్డ్ ను ఫినిష్ చేస్తారో వారే విజేత అలాగే ఈ వారం ఇంటి కెప్టెన్ అవుతారు.  కంటెస్టెంట్స్ మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది చివరికి జశ్వంత్ మొదట ఫినిష్ చేసి విజేతగా నిలిచాడు. శ్రీరామ్ కాస్తలో మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటికి అడ్డంగా జశ్వంత్ తన పవర్ ని చూపించడం మొదలు పెట్టాడు. మొత్తానికి చంటి పిల్లాడు కాస్త కెప్టెన్ గా అందర్నీ శాసించడానికి సిద్ధమైపోయారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: