టీవీ: బుల్లితెర ప్రముఖ నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Divya
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటీమణులు ఎవరైనా ఉన్నారా..? అంటే అది కేవలం బుల్లితెర యాంకర్స్ అలాగే సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ అని చెప్పవచ్చు. అయితే వీరిలో కొంతమంది వెండితెర హీరోయిన్స్ తో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ఇకపోతే ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
యాంకర్ సుమ:
తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను మైమరిపింప చేయడమే కాకుండా సినీ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతే కాదు తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా చలామణి అవుతున్న ఈమె వివిధ ఛానల్స్ రియాల్టీ షోలకు కూడా పని చేస్తూ ఉంది.  ఆడియో ఫంక్షన్స్ కూడా హాజరు అవుతూ ఉంటుంది.. ఆడియో ఫంక్షన్ కి సుమా హాజరయ్యింది అంటే ఒక ఫంక్షన్ కి రెండు నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తోందట. అవార్డు ఫంక్షన్ అయితే అంతకు మించి ఉంటుందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు.
అనసూయ:
అనసూయను బుల్లితెరపై యాంకర్ అని పిలిస్తే , సినీ ఇండస్ట్రీలో మాత్రం ప్రముఖ నటి అని పిలవచ్చు..
ఎందుకంటే ఈమె బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ నే , సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.. ఈమె కూడా ఒక ఈవెంట్ కు ఏకంగా రెండు లక్షల రూపాయలను తీసుకుంటుందట.
యాంకర్ రష్మీ:
రష్మీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఈమె డాన్స్ ఢీ ప్రోగ్రాం లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. రష్మి కూడా ఒక్కో ఎపిసోడ్ కి  లక్ష రూపాయల వరకు తీసుకుంటుందట.
వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్:
నిన్న మొన్నటి వరకు ఈమె ఎవరో కూడా తెలియదు.. కానీ కార్తీకదీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన వంటలక్క ఒక్కో ఎపిసోడ్ కు 30 వేల రూపాయలను రెమ్యునరేషన్  గా తీసుకుంటుందట. అయితే ప్రస్తుతం తన క్రేజ్ పెరగడంతో ఇటీవల రోజుకు 50 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక వీరితో పాటు యాంకర్ శ్రీముఖి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయలు తీసుకుంటోందట. మంజూష యాభై వేల రూపాయలు, శ్యామల రెడ్డి 50 వేల రూపాయలు ఇలా వీరు ఒక్కో ఈవెంట్ కు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: