బిగ్ బాస్ -5 : ఆ ఇద్దరికీ పెరుగుతున్న క్రేజ్.. ?

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవ‌రి క్రేజ్ పెరుగుతుందో ఎవ‌రి క్రేజ్ త‌గ్గుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఈ రోజు ఒక‌రికి క్రేజ్ ఉంటే మ‌రుస‌టి రోజు అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుందా అంటే చెప్పలేం. దానికి కార‌ణం మ‌నం అనుకున్న విధంగా కంటెస్టెంట్స్ ఈ రోజు క‌నిపిస్తే రేపు అలా ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే కొంత మందికి బ‌య‌ట ముందే ఎంతో క్రేజ్ ఉంటుంది. వారు హౌస్ లోకి వ‌చ్చాక వారికి ఉన్న అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ప్ర‌స్తుతం బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీజ‌న్ లో కూడా కంటెస్టెంట్ ల‌కు అభిమానులు అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే కొంత‌మందికి ముందే ఫ్యాన్ బేస్ ఉండ‌గా మ‌రికొంద‌రికి కొత్త‌గా ఏర్ప‌డుతున్నారు. తాజాగా హౌస్ లో జ‌రిగిన ప‌రిస్థితుల‌ను బట్టి ష‌న్ముక్ ష‌న్ను మ‌రియు వీజే స‌న్నీల‌కు అభిమానులు పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

ఇద్దరూ కూడా సైలెంట్ గా క‌నిపిస్తుండ‌టం అంతే కాకుండా కావాల్సిన‌ప్పుడు స‌రదాగా ఉండ‌టం అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఎపిసోడ్ ల‌లో ఇద్ద‌రి ప‌ర్ఫామెన్స్ ఫ్యాన్స్ పెర‌గ‌టానికి కార‌ణ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. ష‌ణ్ముక్ జ‌శ్వంత్ కు ముందు నుండి సోషల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ష‌ణ్ముక్ సోష‌ల్ మీడియా సెలబ్రెటీగానే గుర్తింపు తెచ్చుకోవ‌డం ఆ త‌ర‌వాత యూత్ కు క‌నెక్ట్ అయ్యేలా ఉన్న వెబ్ సిరీస్ ల‌లో న‌టించి ఆక‌ట్టుకోవ‌డంతో ష‌ణ్ముక్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు వారి స‌పోర్ట్ తో పాటు ష‌ణ్ముక్ ను స‌పోర్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెగుతుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొద‌టి వారం ష‌ణ్ణుక్ పూర్తిగా సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఆ త‌ర‌వాత రెండో వారం నుండి హౌస్ లో సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇత‌రుల‌తో క‌ల‌వ‌డం టస్క్ లు ఆడ‌టం కూడా ప్రారంభించాడు.

ఇక వీజే స‌న్నీ గ‌తంలో మా మ్యూజిక్ లో యాంక‌ర్ గా చేశాడు. ఆ స‌మ‌యంలో స‌న్నీ యాటిట్యూడ్ కు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా స‌న్నీకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ‌డ‌గా ఉంటుంది. ఇక ఇటీవ‌ల హౌస్ ఓ టాస్క్ జ‌రుగుతుండ‌గా సిరి త‌న టీష‌ర్ట్ లో సన్నీ చేయి పెట్టాడంటూ గోల గోల చేసింది. కానీ స‌న్నీ తాను అస‌లు చేయిపెట్ట‌లేద‌ని వాపోయాడు. అయితే నిన్న దానికి సంబంధించిన వీడియోను నాగ్ చూపించ‌గా సిరి త‌ప్పు తెలుసుకుంది. స‌న్నీపై కూడా ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురించారు. దాంతో స‌న్నీకి కూడా స‌పోర్ట్ పెరిగినట్టు క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: