టీవీ:నటి సమీరా షరీఫ్ ఎన్ని కోట్లకు అధిపతిరాలో తెలుసా..?

Divya
బుల్లితెరపై ఎంతో మంది నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ఎంతో మంది కొత్త వాళ్లు కూడా వస్తూనే ఉన్నారు. సక్సెస్ అయితే వాళ్ల రేంజ్ కేవలం ఒకే ఒక సీరియల్ ద్వారా మారిపోతుంది. లేదంటే ఇక వారు చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ ఉండవలసి ఉంటుంది. అలా బుల్లితెరపై నటి సమీరా షరీఫ్ తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈమె అసలు ఆస్తి విలువ ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

బుల్లితెరపై తెలుగు , తమిళ నాటికలలో నటించి తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సమీరా షరీఫ్. ఈమె ఎక్కువగా సామ్ అని పిలుస్తారు. ఈమె మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాదులో 1988వ సంవత్సరంలో నవంబర్ 14 న జన్మించింది. ఇక ఈమె ప్రస్తుతం వయసు 33 సంవత్సరాలు. ఈమె తండ్రి ఒక వ్యాపారవేత్త. తల్లి గృహిణి. సోదరి సమీర శ్రీ ఉన్నది.

ఈమె ఒక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్  కొడుకు సయ్యద్ అన్వర్ ని ప్రేమించి తమ ఇంట్లో అంగీకారంతోనే వివాహం చేసుకున్నది. ఇటీవల వీరికి ఒక అబ్బాయి జన్మించాడు. ఈమెకు చిన్నప్పట్నుంచే డాన్స్ అంటే చాలా ఇష్టం  ఉండడంతో తన తండ్రి ప్రోత్సాహం వల్ల డాన్స్ స్కూల్కి వెళ్లి డాన్స్ నేర్చుకునేది. అలా కాలేజీ స్కూల్ లో ఎటువంటి ఫంక్షన్ జరిగిన ఈమె అందులో పాల్గొనేది. 2006 సంవత్సరంలో ఆడపిల్ల నాటిక ద్వారా ఈమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్లో నటించింది ఈమె..
ఇక అదిరింది షో కి కూడా ఈమె యాంకర్ గా పని చేసింది. అయితే కొన్ని కారణాల చేత ఈ షో మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈమె ఇష్టమైన హీరోలు మహేష్ బాబు, ప్రభాస్. ఇష్టమైన నటీమణులు సమంత , కాజల్. ఇక ఈమె ఆస్తి విలువ 16 కోట్ల రూపాయలు ఉన్నదట. ఈమెకు ఖరీదైన రెండు కార్లు, 2 ఖరీదైన అపార్ట్మెంట్లు హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: