BIGG BOSS 5 : స‌ర‌యు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందా..?

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ సీజ‌న్-5 ఇప్ప‌టికే ప్రారంభం అవ్వ‌గా గ‌త సీజ‌న్ల‌తో పోలీస్తే రేటింగ్ మాత్రం త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సీజ‌న్ లో గ‌త సీజ‌న్ల కంటే గొడ‌వ‌లు కొట్లాట‌లు ఎక్కువ‌గానే ఉన్నా రేటింగ్ మాత్రం ప‌డిపోయింద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5 లో యూట్యూబ‌ర్ లు, సీరియ‌ల్ న‌టీన‌టులే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. గ‌త నాలుగు సీజ‌న్ల‌లో హీరోలు ఎంట్రీ ఇవ్వ‌గా సీజ‌న్ -5 లో మాత్రం ఒక్క సినిమా హీరో క‌నిపించ‌లేదు. యాంక‌ర్ ర‌వి ఓ సినిమాలో హీరోగా న‌టించినా ర‌విని ప్రేక్ష‌కులు యాంక‌ర్ గానే గుర్తిస్తారు. ఇదిలా ఉంటే ప్ర‌తి బిగ్ బాస్ సీజ‌న్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయ‌న్న సంగ‌త తెలిసిందే. అయితే ఈ సీజ‌న్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండ‌బోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. 

మూడో వారంలో యంక‌ర్ వ‌ర్షిని వైల్డ్ కార్డు ఎంట్రీకి బిగ్ బాస్ ప్లాన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ లోకి మొద‌టి వారం ఎలిమినేట్ అయ్యిన స‌రయు కూడా మ‌ళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ లో ప్ర‌స్తుతం ఉన్న‌వాళ్ల‌లో స‌ర‌యు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని అంతా అనుకుంటున్నారు. స‌ర‌యు కూడా తాను మొద‌టి వారమే ఎలిమినేట్ అవ్వ‌డంపై షాక్ కు గురైంది. మ‌రోవైపు తాను ల‌వ్ ట్రాక్ లు న‌డ‌ప‌లేన‌ని కావాల‌నే బిగ్ బాస్ పంపిచాడు అన్న భావ‌న‌లో కూడా ఉంది. అంతే కాకుండా తన‌ను కాలల‌నే సిరి అండ్ బ్యాచ్ కావాల‌ని బ‌యట‌కు పంపించార‌ని స‌ర‌యు ఆరోపిస్తోంది. మ‌రో వైపు స‌ర‌యు అభిమానులు కూడా స‌ర‌యు బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు.

ఇక గ‌త సీజ‌న్ ల‌లో నూతన్ నాయుడు, అలి రెజా లాంటి వాళ్లు రీ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు కూడా ఆ సీజ‌న్ ల‌లో బ‌ల‌మైన కంటెస్టెంట్స్ కావ‌డంతో స‌ర‌యు ఎంట్రీ కూడా ప‌క్కా ఉంటుంద‌ని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక స‌ర‌యు కూడా బిగ్ బాస్ బ‌జ్ మ‌రియు హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత సంచ‌ల‌న కామెంట్లు చేసింది. దాంతో స‌రయు ను మ‌ళ్లీ హౌస్ లోకి పంపితే మంచి కంటెంట్ వ‌స్తుంద‌న్న కార‌ణంతో అయినా బిగ్ బాస్ పంపిచే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: