బుల్లితెరపై నటిస్తున్న ఎంతో మంది నటులలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. అంతేకాదు బుల్లితెర నటులలో వెండితెరపై ఎక్కువగా అవకాశాలు కొట్టేస్తోంది మాత్రం అనసూయ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె, వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అంతే కాదు ఈ మధ్య స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో అనసూయ ఉండేటట్టు చూడమని , దర్శకులకు కూడా సలహాలు ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అనసూయ క్రేజ్ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా పుష్పా లో కూడా అవకాశాన్ని కొట్టేసింది ఈ అమ్మడు. అది కూడా ఎక్కువగా మెగా ఫ్యామిలీ లోనే నటిస్తుండడం విశేషం. ఇక మెగా ఫ్యామిలీకి ఈమె కూడా ఒక లక్కీ లేడీగా అయ్యింది. అయితే ఈమె ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. వాటి విశేషాలు చూద్దాం.
ఇక ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాలో అనసూయ పాత్ర గురించి ఇప్పుడు చాలా వరకు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో.."వారియర్" పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ పాత్రలో ఈమె నటిస్తుందా..? అన్న విషయంపై తెలుసుకోవాలంటే, ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అధికార ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక పోతే ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడంతో మళ్లీ బుల్లితెరపై అడుగులు వేస్తుందా..? అనే అనుమానాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అందరి హీరోలకు అనసూయ లక్కీ లేడీ గా మారుతుందో వేచి చూడాలి మరి.