టీవీ : డాక్టర్ బాబు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా..?

Divya
బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించాడు డాక్టర్ బాబు. అలియాస్ నిరుపమ్ పరిటాల. ఇక ఈయన కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అవడమే కాకుండా ఈయన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. నిరుపమ్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది . ఆ పోస్ట్ ఏమిటి..? అందులో ఏం వుంది..?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తన సోషల్ మీడియా ఖాతా నుంచి తన భార్యతో కలిసి త్వరలో వచ్చేస్తున్నాము.. అదేంటో చెప్పుకోండి అంటూ ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి వదిలాడు.. అంతేకాకుండా ప్రేక్షకులకు ఒక హింట్ ఇస్తూ అనౌన్స్ మెంట్ ఏందో కనుక్కోండి చూద్దాం.. అని పజిల్ లాగా పెట్టాడు ప్రేక్షకులకు. ఇక త్వరలో బిగ్ బాస్-5 ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిరుపమ్ తన భార్యతో కలిసి జంటగా బిగ్ బాస్ లోకి బెళ్లనున్నారా అని అనుకుంటున్నారు.

కొంతమంది త్వరలో వీరిద్దరూ కలిసి కొత్త యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించబోతున్నారు అన్నట్లుగా వినిపిస్తోంది. కానీ పోస్టర్ చూసిన ప్రకారం ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ షో కి సంబంధించిన ఫోటోల ఉన్నట్లు తెలుస్తోంది.. ఒకవేళ "హిట్లర్ గారి పెళ్ళాం"అని సీరియల్ ద్వారా నిరూపమ్  భార్య ఏమైనా ఎంట్రీ ఇస్తుందా..? అని ప్రేక్షకులు సందిగ్ధంలో ఉన్నారు.
ఇక ఏది ఏమైనా వీరిద్దరు రేపు 11:25 నిమిషాలకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేస్తున్నట్లు ఆ పోస్టర్ లో కనిపిస్తున్నది. ఏది ఏమైనా రేపటి వరకు ఆలోచిస్తే అది ఏమిటనే సస్పెన్షన్ నిరుపమ అభిమానులకు తీరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సెలబ్రిటీలు కూడా ప్రేక్షకులలో ఇలాంటి సస్పెన్షన్ క్రియేట్ చేస్తుండటం గమనార్హం. నిరుపమ్ అలాగే ఆయన భార్య ఏ షో తో బుల్లితెరపై అలరించనున్నారో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: