టీవీ : రచ్చ రవి జబర్దస్త్ కి దూరం కావడానికి కారణం..

Divya
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ అంటే ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అందులో వేసే పంచ్ డైలాగులు, తమ నటనతో ప్రేక్షకులను, అందులోని ఆర్టిస్టులు మంత్రముగ్ధుల్ని చేస్తారు. ఇక ఇందులో యాంకర్ అనసూయ కూడా తన అందంతో అప్పుడప్పుడు పంచ్ డైలాగులు వేసి  అలరిస్తూ ఉంటుంది. ఇక ఇందులోని జడ్జెస్ కూడా సమన్వయంగా మార్కులు ఇస్తుంటారు. అయితే ఇందులోని కమెడియన్స్ లో రచ్చ రవి కూడా ఒకరు. అయితే ఆయన జబర్దస్త్ లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఇందులోనే ఎంతోమంది కమెడియన్లు టీంలీడర్ లుగా కూడా ఎదిగిపోయారు. ఇప్పుడున్న జబర్దస్త్ కి,  అప్పట్లో జబర్దస్త్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా గ్లామర్ తోనే నడిపిస్తున్నారు జబర్దస్త్ ని.

ఇక ఇందులో కమెడియన్ గా నటించిన రచ్చ రవి అందరికీ బాగా సుపరిచితమే. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రచ్చ రవి వరంగల్ జిల్లాలో హనుమకొండలో జన్మించారు. ఈయన తండ్రి ఒక సాధారణ కార్ డ్రైవర్ గా పని చేస్తాడు. ఈయన ఎంబీఏ పూర్తి చేయడంతో.. అదే దశలోనే మున్సిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్ గా గవర్నమెంట్ జాబ్ ను కూడా పొందాడు.
ఈయనకి చదువుకునే రోజుల నుంచి సినిమాలంటే పిచ్చి ఉండడంతో, ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం తో తన తల్లిదండ్రులు రచ్చ రవి ని చెడామడా తిట్టారు. ఇంకా అలా తిట్టడంతో తన ఇంటి నుండి హైదరాబాద్ కి వచ్చేశాడు. ఇక ఒక పాపులర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రచ్చ రవికి అనుకోకుండా జబర్దస్త్ ప్రోగ్రామ్ కి, 2013 లో చమ్మక్ చంద్ర సహాయంతో జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టాడు. ఇక ఇందులో పేరు బాగానే సంపాదించాడు కానీ, డబ్బులు మాత్రం  వెనక్కి తీసుకోలేదు.
ఇక టీం లీడర్ అవ్వడంతో సమయం మొత్తం తను జబర్దస్త్ షో కేటాయించడం వల్ల.. సినిమాలలో వస్తున్న అవకాశాలను వదులుకోవాల్సి రావడంతో.. తను జబర్దస్త్ షో కి దూరం అయ్యాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: