టీవీ : చచ్చి బ్రతికిన జబర్దస్త్ కమెడియన్..

Divya
ప్రస్తుతం బుల్లితెరపై ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో ఎంతోమంది కమెడియన్లు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరందరూ ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చారు అని చెప్పవచ్చు. ఇందులోని ఒక కమెడియన్ కు ఆరోగ్య పరిస్థితులు బాగ లేక చావు అంచుల దాకా వెళ్లి వచ్చారట. అయితే ఆ కమెడియన్ ఎవరో తెలుసుకుందాం. అతని ఆరోగ్య పరిస్థితి ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు  బాగానే రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్లు చాలామంది బుల్లి తెర వైపు అడుగులు వేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే, ఆయన ఎవరో కాదు జీవన్. జబర్దస్త్ షో లో ఈయనకు జిగేల్ జీవన్ అనే  ఒక టీం కూడా ఉంది. జీవన్ గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఇంకా ఆయన ఎందుకు కనిపించడం లేదు అంటే దాని వెనుక చాలా పెద్ద కథ ఉందని చెప్పవచ్చు..

జీవన్ జబర్దస్త్ షోలో తన టీం ను  ముందుకు నడిపించడమే కాకుండా, డప్పు వాయిద్యం కూడా చాలా బాగా చేస్తాడు. జబర్దస్త్ షో లో చాలా టీంలను తొలగించడం జరిగింది. వారిలో సరిగా పర్ఫామెన్స్ చేయడం లేదని , సత్తిపండు లాంటి  టీం లీడర్లను కూడా తీసేసారు. ఇక అందులో భాగంగానే జీవన్ పర్ఫామెన్స్ బాగా  చేయకపోవడంతో ఇతడిని కూడా తొలగించారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం మరో విషయం. ఏమిటంటే , ఈ జీవన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం ఎవరికీ తెలియదు.


కానీ జబర్దస్త్ టీమ్ లీడర్లకు జీవన్ తన ఆరోగ్య పరిస్థితిని గురించి తెలపడంతో , వాళ్లే అతనికి అండగా నిలిచారు. ఎన్నో రోజుల తర్వాత రీసెంట్ గా  ప్రసారమైన జబర్దస్త్ షోలో తిరిగి జీవన్ కనిపించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కూడా. చాలా రోజుల తర్వాత తిరిగి జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చారు కదా..! అని రష్మి అడగగా, దానికి జీవన్ చాలా ఎమోషనల్ అయ్యారు. తాను బతికే అవకాశం చాలా తక్కువ అని, ఒక సమయంలో ఇక చనిపోతావని కన్ఫామ్ కూడా చేశారని జీవన్ వచ్చేశాడు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. కానీ జబర్దస్త్ టీం లీడర్ ల సహాయంతో ని బ్రతకగలిగాడు జీవన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: