టీవీ: TRP కోసం ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన షోస్ ఇవే..

Divya
ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో షో లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ షోలు ఇప్పుడు టీ ఆర్ పీ  రేటింగ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ బుల్లితెరపై అప్పట్లో ప్రసారమయ్యే షోలకు ఇప్పుడు ప్రసారమయ్యే షోలకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే వాస్తవానికి అప్పట్లో ప్రసారమయ్యే షోలు చాలా పద్ధతిగా ఉండేవి.
ఇక అంతే కాకుండా యాంకర్లు కూడా అచ్చ తెలుగు అమ్మాయిలలా కనిపించేవారు. ఇక అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండేవి షోలు. కానీ ప్రస్తుతం అలా లేదు.చాలా మారిపోయాయి. కాలం మారుతున్న కొద్దీ వీరు కూడా వేగంగా మారాలని, టీ ఆర్ పీ  రేటింగ్ కోసం మాత్రమే ఇప్పుడు షోలను చేస్తున్నట్లు ఉంది.
ఇప్పుడు ఎక్కువగా టీవీలలో ఫ్రాంక్ లు చేయడం చాలా ఎక్కువ అయ్యాయి. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు  కూడా బాగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఏది పడితే అది చేస్తున్నారు. అందులో ముఖ్యంగా "జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షో లతో రీసెంట్ గా వచ్చిన రెచ్చిపోదాం బ్రదర్ వంటి షో కూడా ముందుగా  ప్రోమో లో ఒక చిన్న ఫ్రాంక్ ను  చేసి వదలడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి.
ఇక జబర్దస్త్ షోలో సుధీర్ రష్మి  గురించి అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలపడంతో అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ అది కేవలం బుల్లితెర పెళ్లి గా మాత్రమే నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే ఒక ఇంటర్వ్యూలో రేటింగ్ కోసమే చేశామని చెప్పుకొచ్చారు.

ఇక వీరిద్దరే కాకుండా మరికొన్ని జంటలు కూడా ఉన్నాయి.. లాస్య- రవి ,"జబర్దస్త్ లో అనసూయ - హైపర్ ఆది","పటాస్ షో లో రవి - శ్రీముఖి"."పోవే పోరా లో సుధీర్ - విష్ణు ప్రియ", సుధీర్ -  వర్షిని" ఇలా ఎన్నో జంటలను టిఆర్పి రేటింగ్ కోసం ప్రేక్షకులను పిచ్చోళ్లను చేస్తున్నాయి. ఇక ఈ మధ్యనే ఇమ్మాన్యుయేల్-వర్షా లను కూడా  పాపులర్ చేస్తున్నారు. కానీ ఈ షో లో జరిగే టువంటి మొత్తం అన్నీ టీ ఆర్ పీ  రేటింగ్ కోసమే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: