టీవీ: బిగ్ బాస్-5 లో కీ మరో బుల్లితెర నటి..!

Divya

బుల్లి తెర పై బిగ్ బాస్ సీజన్-5 కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇక ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకొని, ఎంత మంచి టీ ఆర్ పీ రేటింగ్ సాధించిందో మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే.ఇక ఇందులో కంటెస్టెంట్ లుగా, ఎవరు పాల్గొంటారు అనే విషయం ఇప్పటివరకు అధికారికంగా తెలియలేదు. ఎవరికి తెలిసిన విధంగా వారు కొంతమంది పేర్లను తెలుపుతున్నారు. ఇప్పుడైతే బిగ్ బాస్ -5 లోకి ఒక సీరియల్ నటి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తోంది అని తెలుస్తోంది.అయితే  ఆమె గురించి తెలుసుకుందాం.

ఇక ఇంతకుముందు లాగే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన వారిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా యధావిధిగా అలాంటి సెలబ్రిటీ లనే తీసుకుంటున్నారు.ఇక  ఆమె ఎవరో కాదు "సిరి హనుమంత్". ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. దీంతో ఈమె బిగ్ బాస్ -5 లో కి కంటెస్టెంట్ గా వెళుతోందని ప్రచారం జరుగుతోంది.

ఈమె ఉయ్యాల జంపాల అనే నాటిక  ద్వారా బుల్లితెరపై పరిచయమైంది. అంతేకాకుండా ఈమె యాంకర్ గా పలు ఛానల్స్ లో కూడా చేసింది. ఇక అంతే కాకుండా ఈమెకి  స్టార్ డం ను తెచ్చిపెట్టిన సీరియల్ "అగ్నిసాక్షి". ఈమె ఒక వ్యక్తితో కలిసి"సాఫ్ట్వేర్ బిచ్చగాళ్ళు"అనే షార్ట్ ఫిలింలో, నటించడంతో పాటు, వీరిరువురు కలిసి అనేక వెబ్ సిరీస్ లో నటించారు. ఇక దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలిపారు ఒక ప్రముఖ ఛానల్.
ఇక సోషల్ మీడియా ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇక తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ తన అభిమానులను సంతోషపరుస్తుంది. అయితే  సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ ని అందుకున్న ఈమెను, త్వరలోనే బిగ్బాస్ సీజన్ ఫైవ్ లోకి తీసుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: