టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?

Divya

బుల్లితెరపై ఈ మధ్య సీరియల్స్ తో పాటు పలు షోల హవ ఎక్కువగా  కొనసాగుతోంది. అంతేకానీ బుల్లితెర పైన కామెడీ షోలు  బాగా పాపులారిటీని అందుకుంటున్నాయి. ఇక మంచి టిఆర్పి రేటింగ్ కూడా సాధించడంతో వీటికి  క్రేజ్  బాగా పెరుగుతోంది. ఇక వీటికోసమే బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు పుట్టుకొస్తున్నారు. అలా పుట్టుకొచ్చినా, తొందరగా బాగా పేరు సంపాదించిన కూడా నిలదొక్కుకోలేక పోతున్నారు. మరికొందరైతే ఏకంగా కొన్ని సంవత్సరాల నుంచి ఒకే షోలలోనే యాంకర్ గా చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణి , విష్ణు ప్రియా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ టీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న రెచ్చిపోదాం బ్రదర్ అనే కామెడీ షో కి  మేఘన యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈమె  గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈమె అసలు పేరు మేఘనా కుమార్. ఈమె హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఈమె నలంద విద్యా నికేతన్ హై స్కూల్, వి.ఎస్. లక్ష్మి డిగ్రీ కళాశాలలో చదువును పూర్తి చేసింది. చదువు మొత్తం పూర్తి అయిపోయిన తరువాత , ఈమెకు యాక్టింగ్ పైన  ఆసక్తి  ఉండటంతో తను మొదట తమిళ ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టింది. అక్కడ కూడా పలు సీరియల్స్ లో నటించింది.

అక్కడ నటించినా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో తిరిగి తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్ళింది. దాంతో తెలుగులో "ఈ కథలో పాత్రలు కల్పితం"అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో.. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే "రెచ్చిపోదాం బ్రదర్ "అని షో ద్వారా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఈమె పర్వాలేదు అనిపించుకుంటోంది.

ఈమెకు కూడా అనసూయ, రష్మీ  మాదిరిగా స్టార్ యాంకర్ కావాలని కోరిక ఉందట. అందుకే  వెండితెర  నుండి బుల్లితెర షో ల వైపు అడుగులు వేసింది. అయితే ఈమె ఇప్పుడిప్పుడే ఆడియన్స్ కు కొద్దిగా దగ్గర అవుతోందని చెప్పవచ్చు. అయితే ఈమె కోరిక  నెరవేరాలని మనం కూడా  కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: