అప్పట్లో వెండితెరపై కొన్ని సినిమాలలో నటించి, కనిపించకుండా పోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇక హీరోయిన్ లే కాకుండా హీరోలు కూడా ఒకప్పుడు స్టార్ హీరో గా ఎదిగి, ఆ తరువాత సినిమాలో కనిపించకుండా పోయారు. ఇక అలాగే బుల్లితెరపై కూడా కొందరు నటులు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయినా కూడా కనిపించకుండా పోయారు. అలాంటి నటులు ఎవరో తెలుసుకుందాం.
1). ఉత్తర:
ఈటీవీలో ఒకప్పుడు బాగా ప్రసారమైన నాటికలలో "లేడీ డిటెక్టివ్" కూడా ఒకటి. ఈ నాటిక ముఖ్యంగా మంగళవారం రోజున వచ్చేది. ఈ సీరియల్ ను దర్శకుడు వంశీ తీశారు. అంతేకాకుండా ఈ సీరియల్ అప్పట్లో బాగా ప్రసారమైంది. అయితే ఇందులో నటించిన నటి ఉత్తర, ఈ సీరియల్ తర్వాత పెళ్లి చేసుకొని, సెటిల్ అయింది.
2). కావేరి:
ఇక ఈ టీవీ లో బాగా ప్రసారమైన సీరియల్ లలో స్నేహ సీరియల్ కూడా ఒకటి. ఇందులో నటించిన నటి కావేరి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత 2013 లో ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
3). అచ్యుత్,యమునా:
ఒకప్పుడు అన్వేషిత సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు బాగా తెలుసు. దీనికి ముఖ్య కారణం సస్పెన్స్ థ్రిల్లర్ తో ఉన్న సన్నివేశాలు ఉండడమే. ఈ సీరియల్ లో అచ్యుత్, యమునా బాగా నటించారు అని చెప్పవచ్చు. ఈ సీరియల్ ఏకంగా ఎనిమిది నంది అవార్డులను గెలుచుకుందట. ఇక అచ్యుత్ మరణించగా, యమునా సీరియల్స్ లో ఇప్పటికీ రాణిస్తోంది.
4). మహర్షి, జ్యోతి రెడ్డి:
ఇక పాపులరైన సీరియల్ లలో ఎండమావులు సీరియల్ కూడా ఒకటి. ఈ నాటికలో ఎంతో మంది నటులు నటించారు. ఇందులో నటించిన మహర్షి, జ్యోతి రెడ్డి వీరిద్దరూ మెయిన్ క్యారెక్టర్ గా ఈ నాటికలో నటించారు. అంతేకాకుండా ఇందులో నటించిన మహర్షి ఎన్నో చిత్రాలలో ఆర్టిస్ట్ గా నటించింది.