ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తనదైన శైలిలో నటించడమే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది యాంకర్ అనసూయ. ఇప్పటికీ 16సంవత్సరాల పడుచు పిల్లలా కనిపించే యాంకర్ అనసూయ..ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరైనా నమ్మగలరా..? ఈమె వయసు ఎంత ఉన్నా కూడా, ఇంకా వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అనసూయ సోగ్గాడే చిన్ని నాయన..చిత్రంలో నటించిన తీరు ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది.
ఇక ఆ ఫోటోలో ఆమె ,ఆమె తండ్రి ,తన చెల్లెళ్ళ తో కలసి దిగిన ఫోటో. ఇక చిన్ననాటి ఫోటోని అనసూయ ఫాదర్స్ డే సందర్భంగా షేర్ చేయడంతో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇక అనసూయ వ్యక్తిగత విషయానికి వస్తే, అనసూయకి వాళ్ళ నానమ్మ ఆ పేరు పెట్టారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తను కాలేజ్ లో చదువుతున్న సమయంలో ఎన్టీఆర్ నటించిన "నాగ"సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు అందంగా లేకపోవడంతో అనసూయ ఆమె స్నేహితులను చూసిన మేనేజర్ ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తాము.. కేవలం 3 గంటలు పాటు షూటింగ్ లో ఉంటారా అని అడిగాడు. ఇక "ఎన్టీఆర్ "తో సినిమా అనగానే ఆమె ఓకే చెప్పేసింది.
ఇక ఆమె చదువుకుంటున్న సమయంలో, తనకు ఇష్టం లేకపోయినా ,తన నాన్నగారి బలవంతం మేరకు NCC లో చేరింది. అక్కడ అనసూయని బీహార్ కి చెందిన భరద్వాజ్ చూసి ఆమె ప్రేమలో పడ్డారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత అనసూయ.. భరద్వాజ్ ప్రేమను ఒప్పుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె వివాహం చేసుకుంది. ఇటీవల ఈమె థాంక్యూ బ్రదర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ రాకెట్ లా దూసుకుపోతోంది.