టీవీ: సినిమా ఆఫర్లను వదులుకున్న బుల్లితెర నటి..

Divya
ఇటీవల కాలంలో ఎక్కువగా బుల్లితెర నటీమణుల హవానే కొనసాగుతోంది. రోజు రోజుకి సీరియల్స్ లో  నటించే వారి క్రేజ్ అమాంతం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా సినిమాలో నటించే వారి కంటే సీరియల్ లో నటించే వారికి ఎక్కువ డిమాండ్ పెరగడం గమనార్హం. దీంతో వారి క్రేజ్ ఎంత ఉందో మనం అర్ధం చేసుకోవాలి. అలాంటి వారిలో బుల్లితెర నటి "నవ్య స్వామి" కూడా ఒకరు.

నవ్య స్వామి సీరియల్ లో  నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి అనే సీరియల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈ సీరియల్ లో మాత్రమే కాకుండా  మరి కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తోంది. మీనాక్షి సీరియల్ తో తను సంపాదించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సీరియల్ ద్వారానే ఈమె స్టార్ హీరోయిన్ గా మారిందని చెప్పవచ్చు.

ఈ మధ్యనే బిగ్ బాస్ ఫేమ్ రవి కృష్ణ తో ఈమె కలిసి నటించడం వల్ల ఈమె పై రూమర్లు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి  పలు కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఇలా వీరిద్దరూ  కలిసి ఉండడం వల్ల వీరి మధ్యలో ఏదో ఉన్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో అన్నింటినీ కొట్టిపారేసింది నవ్య స్వామి. ఇటీవల ఈమెకు ఉన్న క్రేజ్ కి సినిమాలలో నటించేందుకు అవకాశం వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీరియల్స్ కు ఇచ్చిన డేట్స్ కారణంగా ఇప్పుడు వెండితెర మీద కి రాలేనని తేల్చి చెప్పేసింది ఈ భామ.

హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి నవ్య స్వామి. ఈమె పలు షోలలో డాన్సులు చేయడమే కాకుండా కామెడీతో కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఈమె కన్నడ భాషలో  పుట్టినా తెలుగు బాగా మాట్లాడడంతో ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో  చాలా బిజీ గా నటిస్తోంది నవ్య స్వామి. త్వరలోనే సినిమాల్లోకి వచ్చే విషయాన్ని చెప్తాను అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: