టీవీ : జబర్దస్త్ సత్య శ్రీ ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా?

Divya

సాధారణంగా ఇటీవల కాలంలో కొంతమంది బుల్లితెరపై బాగా క్రేజ్ ను సంపాదించుకుని, ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇక్కడ నటించిన ఎంతో మంది నటులు నటీమణులు ఇక్కడ ప్రేక్షకాదరణ బాగా పొంది, ఆ తర్వాత వెండితెరపై కూడా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మరికొంతమంది సినిమాలలో నటించినప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేక బుల్లితెరలోకి వస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మంచి పాపులారిటీని అందుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో సత్యశ్రీ కూడా ఒకరు. ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో చమ్మక్ చంద్ర టీమ్ లో చమ్మక్ చంద్ర పక్కన నటించి, అక్కడ తన భారీ డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

అయితే ఇటీవల ఈమె దిగిన ఫోటోలు చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా సరిపోరు అనేంతగా ఉంది. అయితే ఈమె జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర భార్య గా నటించి అందరిని బాగా ఆకట్టుకుంది. ఇక అయితే ప్రస్తుతం చమ్మక్ చంద్ర జబర్దస్త్ కు దూరమవడంతో, ఇక తిరిగి వీరిద్దరూ జీ తెలుగు లో ప్రసారమైన  అదిరింది ప్రోగ్రామ్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు.అయితే ఈమె కేవలం బుల్లితెరపై కాకుండా షార్ట్ ఫిలిమ్స్ అలాగే సినిమాలలో కూడా నటించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ అలాగే ఆర్ డి ఎక్స్ లవ్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఈమె కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు.ఇక బుల్లితెరపై కేరాఫ్ చంద్ర గా మిగిలిపోయింది సత్య శ్రీ.


సత్య శ్రీ హైదరాబాద్ లో జన్మించింది. ప్రస్తుతం కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది. అయితే ఈమె ఎప్పుడూ అంటుంటే మాట ఏమిటంటే, జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది అని. ముఖ్యంగా చమ్మక్ చంద్ర ద్వారా నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు..ఏది ఏమైనా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: