టీవీ : ఓంకార్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

Divya

బుల్లితెరపై యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా  ఓంకార్ తన సత్తాను ఎంతలా చాటుకున్నాడో మనకందరికీ తెలిసిందే. ఓంకార్ ఏ ఛానల్ లో ఏ షోకి యాంకరింగ్ చేసి, ఆ షో అత్యధిక  టీఆర్పీ రేటింగ్ తో నమోదవుతుంది. అయితే ఓంకార్ పూర్తి పేరు "ఆడియట్ల ఓంకార్". 1980 మార్చి 13న ఏపీ లోని కాకినాడలో జన్మించిన ఓంకార్ యొక్క వయసు 41 సంవత్సరాలు. తండ్రి ఎస్ వి కృష్ణారావు. తల్లి గృహిణి. ఆయనకి  అశ్విన్, కళ్యాణ్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆయనికి రూ. 35 కోట్ల ఆస్తి వరకు ఉంది.
ఓంకార్ కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో చదువుకున్నారు. గుంటూరు జిల్లా సిద్ధార్థ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన ఓంకార్ కి పెద్దల ఆశీర్వాదంతో "స్వరూప" అనే అమ్మాయితో పెళ్లయింది. వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది. ఓంకార్ క్రికెటర్ అవుదాం అనుకొని అది కుదరకపోవడంతో సినిమా రంగం వైపు అడుగులు వేశాడు.
అయితే ఒకానొక సమయంలో నిర్వహించిన ఆదిత్య మ్యూజికల్ ఆడిషన్ లో యాంకర్ గా సెలెక్ట్ అయ్యి, తక్కువ సమయంలో బాగా క్లిక్ అయ్యాడు. ఇక 2007లో ఆట డాన్స్ లో ఓంకార్ యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఆశలతో ఓంకార్ "అన్నయ్య" అని అందరితో ప్రేమగా పిలుచుకునేవారు. ఓంకార్ నటించిన మాయాద్వీపం, చాలెంజ్, అదృష్టం, సరిగమప షోల తో ప్రేక్షకులకు  బాగా దగ్గరయ్యారు.
ఓంకార్ రోజుకు 60 నుంచి 70 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.అంతేకాకుండా పలు టీవీ షోలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఇతనికి రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీరు గచ్చిబౌలిలోని నిహారిక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇందులో ప్లాట్ ఖరీదు సుమారుగా కోటిన్నర వరకు ఉంటుంది. ఈయనకి చిరంజీవి, వెంకటేష్ అభిమాన నటులట. ఇష్టమైన హీరోయిన్ తాప్సీ. ఇష్టమైన ప్రదేశం ముంబాయి. ఇష్టమైన ఆహారం బిర్యాని.చపాతీ. ఈయనికి ప్రయాణంలో  బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: