టీవీ : బుల్లితెర హీరోయిన్ లు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా ?

Divya

బుల్లి తెరపై నటించే నటీమణులు చూడడానికి ఎంతో చూడముచ్చటగా, అందరినీ ఆకర్షిస్తూ అటు ఎమోషనల్ గా ఇటు హాస్యపరంగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. వీరి నటనా, హావభావాలతో ప్రేక్షకులు సైతం శభాష్ అనిపించేలా నటించడం బుల్లితెర నటీ మణులకు మాత్రమే సాధ్యం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వెండితెరపై ఉన్న హీరోయిన్ లకు ఎంత క్రేజ్ ఉంటుందో, అంతే స్థాయిలో బుల్లితెర నటీమణులకు  కూడా అంతే ఉంటుంది.. వీరికి అభిమానులు కూడా ఎక్కువ. అయితే ఈ  అభిమానులకు తమ స్టార్స్ ఏం చదువుకున్నారు ?వారు ఏం చేస్తుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటారు. అయితే ఆ స్టార్ నటీమణులు ఎంతవరకు చదువుకున్నారు ? వారు చదువులవిశేషాలు ఏమిటి? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ బుల్లితెరలోకి రాకముందే న్యాయశాస్త్రం చదివింది. ఇక రక్ష గౌడ్ బి బి ఏ పూర్తి చేసింది.  ప్రముఖ నటి అలాగే నిర్మాత అయిన సుహాసిని మాత్రం కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకొని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుహాసిని కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సినిమాలలో సహాయక పాత్రల్లో కూడా నటించి, అందరినీ మెప్పించింది..
ఆషిక పదుకొనే  ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇక ఐశ్వర్య ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నవ్య స్వామి కూడా బీబీఎం కంప్లీట్ చేసింది. హీరోయిన్ అను శ్రీ బీకాం పూర్తి చేసింది. ఇక మారిన్ కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఇక వీరి లాగే వర్షా కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. కావ్య శ్రీ బీఎస్సీ పూర్తి చేయగా, మేఘన లోకేష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. శిరీష బిటెక్ కంప్లీట్ చేసింది. వైష్ణవి ఎంబీఏ పూర్తి చేయగా, లహరి బిటెక్ కంప్లీట్ చేసింది . ఇక వీరితోపాటు పల్లవి రామ్ శెట్టి కూడా బీటెక్ కంప్లీట్ చేసింది..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, వెండితెరపై నటిస్తున్న హీరోయిన్ల కంటే బుల్లితెరపై నటిస్తున్న హీరోయిన్ లే ఎక్కువ చదువుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: