టీవీ: ప్రేమించి పెళ్లి చేసుకున్న బుల్లితెర నటులు !

Divya

సాధారణంగా మనం సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో సందర్భాలను చూసాము. వీరు కూడా సినిమాలలో కలసి నటించేటప్పుడు, ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.. అయితే సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు బుల్లితెరకు చెందిన కొన్ని జంటలు కూడా అలా ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక జంట బుల్లితెరకు చెందిన ఓ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దీంతో యువ జంట వివాహ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కన్నడ బుల్లితెర పరిశ్రమకు చెందిన నటుడు బాలు అలియాస్ చందన్ కుమార్, సీరియల్ నటి కవిత గౌడ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరు సింపుల్ గా  నిశ్చితార్థం జరుపుకున్నారు. కాగా కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితుల మధ్య శుక్రవారం వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ కన్నడ భామ లక్ష్మీ బారమ్మ ( 2013) సీరియల్ లో వీరిద్దరు చిన్ను, చందు గా ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటి వీరి పరిచయం ప్రేమగా మారింది. దీనితో గత ఎనిమిదేళ్లుగా చందన్ కుమార్,కవిత గౌడ లు  డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఎవరిని పిలవలేకపోయాము. కరోనా తీవ్రతను తగ్గి, ఆంక్షలన్నీ ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని " అనుకున్నట్లు తెలిపాడు.
తమ పెళ్లిని తమ పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి జరిపించాలని కుటుంబసభ్యులంతా నిర్ణయించారని, దీంతో కరోనా నియమాలు మధ్య, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తమ వివాహం జరిపినట్లు చందన్ వెల్లడించారు. కొంత మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాల మా ప్రేమ తిరిగి మమ్మల్ని పెళ్లి ద్వారా ఒక్కటి చేసింది.. ఏది ఏమైనా కవిత నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంటూ చందన్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: