వర్ష క్యారక్టర్ పై ఆది సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే?

Satvika
టెలివిజన్ లో ఇప్పుడు ఎన్నో రకాల షో లు దర్శనమిస్తున్నాయి.. వాటిలో కొన్ని మాత్రమే యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే జబర్ధస్త్ షో ఒకటి. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ ఉంది. అందుకే దీని ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లు స్టార్లుగా వెలుగొందుతున్నారు. వరుస సినిమా అవకాశాలతో రెండు చేతుల సంపాదిస్తున్నారు.


వారిలో ఆది ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి తక్కువ సమయంలోనే టాప్ టీమ్ లీడర్ అయ్యాడతను. ఇలాంటి సమయంలో జబర్ధస్త్ వర్షపై ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది. అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన అదిరే అభి.. జబర్ధస్త్‌లోకి తీసుకొచ్చాడు. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే తన ప్రతిభను బయట పెట్టుకున్నాడు. తర్వాత స్టార్ కమెడియన్ గా అయ్యాడు.


హైపర్ ఆది స్కిట్లు అంటేనే ఎంతో ఫేమస్. అతడి కోసమే జబర్ధస్త్‌ను చూసే పరిస్థితులను కల్పించుకున్నాడు. అంతలా సెలెబ్రిటీ కమెడియన్ అయిపోయాడతను. పది నిమిషాల స్కిట్‌లో తన టీమ్ సభ్యులపై పంచులతో దండయాత్రలు చేస్తూ రచ్చ చేస్తుంటాడు. చుట్టూ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నా.. వన్ మ్యాన్ షోగా స్కిట్‌ను నడుపుకుంటున్నాడు. దాంతో హైలైట్ అవుతున్నాడు.వచ్చే వారం ప్రసారం కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రావడం రావడమే అతడు పంచుల వర్షం కురిపించాడు. అలాగే, అందరినీ గోవా తీసుకెళ్తున్నానని చెబుతూ ఒక్కో ఆర్టిస్టును పరిచయం చేశాడు. అదే సమయంలో వాళ్ల ఊళ్ల గొప్పదనం కూడా చెప్పమన్నాడు. ఈ సందర్భంలో వర్ష క్యారెక్టర్‌పై ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: