బిగ్ బాస్ ద్వారా ఎవరు ఎంత లాభపడ్డారో తెలియదు కానీ అందరూ కన్నా ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం మోనాల్..మరీ ముఖ్యంగా హౌస్‌లో కనిపించే ప్రేమ కహానీల కారణంగా ఈ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో రచ్చ చేసిన ఈ జంట.. బిగ్ బాస్ ఉత్సవంలోనూ రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్ లో లవ్ట్రాక్ లు ఎక్కువగా నడిచాయి.
అందులో బాగా ఫేమస్ అయ్యింది మాత్రం అఖిల్, మోనాల్.. వీరి అర్థరాత్రి రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది. దాంతో వీళ్ళ క్రేజ్ ఓ స్థాయికి చేరుకుంది.. నిజానికి వీళ్లిద్దరూ షో ఆరంభంలో పెద్దగా కలిసింది లేదు. దీనికి కారణం మోనాల్.. మొదట్లో అభిజీత్‌తో సన్నిహితంగా ఉండేది. అప్పుడే అఖిల్‌తోనూ సన్నిహితంగా ఉంది. దీంతో ట్రయాంగిల్ లవ్‌గా ఇది ప్రచారం జరగడంతో బాగా ఫేమస్ అయ్యారు.బిగ్ బాస్ షో అనేది ఒంటరిగా ఆడే రియాలిటీ గేమ్. కానీ, హౌస్‌లో లవ్ ట్రాకు మొదలైన తర్వాత ఎంతో మంది జంటగా ఆడుతూ వార్తల్లో నిలిచారు. గత సీజన్‌లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ కూడా ఇదే ఫాలో అయ్యారు. హౌస్‌లో ఒంటరిగా కాకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. . టాస్కులు చేయడంతో పాటుగా , త్యాగాలు చేస్తూ వచ్చారు.
ఇకపోతే అఖిల్ మోనాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్.మోనాల్ గజ్జర్ గురించి అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక జాకెట్ వేసుకుంటుంది. ఎందుకంటే అది గిఫ్టుగా వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కలుగజేసుకున్న యాంకర్ శ్రీముఖి.. 'నువ్వు పట్టీలు పెట్టావు కదా.. ఇకపై మోనాల్ కాళ్లనే చూస్తారు దాంతో అందరూ నవ్వారు..