అశ్విని తెలుగు సీరియల్స్ ని మానేయడానికి కారణం అదేనా.. సింగపూర్ లో ఆమె ఏం చేస్తుంది
కేరళలోని హిందూ కుటుంబంలో జన్మించిన అశ్విని ని రుద్ర అని కూడా పిలుస్తుంటారు. అశ్విని తన పాఠశాల చివరి సంవత్సరంలో తన స్నేహితులతో కలిసి ఒక మలయాళ మ్యాగజైన్ కోసం 2-3 వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. అయితే ఆ మ్యాగజైన్ వాణిజ్య ప్రకటనలలో అశ్విని ని చూసిన భారతీరాజా ఆమెకు "పుదు నెల్లు పుదు నాతు(1991)" అనే ఓ తమిళ మూవీలోని ఓ కీలక పాత్రను పోషించే అవకాశం కల్పించారు. ఈ మూవీతోనే ఆమె తన నటనా రంగాన్ని ఆరంభించారు. ఈ సినిమా తర్వాత ఆమె ఎక్కువగా తమిళ, మలయాళం చిత్రాల్లో నటించారు.
అశ్విని 1995 లో విడుదలైన హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. అదే సంవత్సరంలో జయసుధ తో కలిసి ఆంటీ అనే సినిమాలో నటించారు. వెంకటేష్, సౌందర్య, లైలా తారాగణంతో తెరకెక్కిన పెళ్లి చేసుకుందాం సినిమా లో రాధిక అనే పాత్రలో అశ్విని నటించి మెప్పించారు. ఆమె చివరిగా నటించిన తెలుగు సినిమా పోలీస్(1999). 1991-2000 మధ్యకాలంలో ఆమె మొత్తం 25 చిత్రాల్లో నటించారు. వాటిలో 16 మలయాళం చిత్రాలే ఉన్నాయి.
1999 తరువాత ఆమె వెండితెరకు దూరమై బుల్లితెర కి దగ్గరయ్యారు. తమిళం, మలయాళం, తెలుగు సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీ అయిపోయారు. తెలుగులో అమ్మకానికో అమ్మాయి, అంతర్నేత్రం, అంతరంగాలు, కళంకిత, తొలి రోజులు అనే టీవీ సీరియల్స్ లో కనిపించిన అశ్విని తన నటనతో ఆడవాళ్ళ కంట కన్నీళ్లు తెప్పించారు. అంతరంగాలు, కళంకిత ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అయితే కాలక్రమేణా తెలుగు లో సరికొత్త చానల్స్ రావడం తో పాటు నటీనటుల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఆమె తెలుగు టీవీ రంగాన్ని వీడి సింగపూర్ కి వెళ్లి సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ఆమె సింగపూర్ సీరియల్స్ లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులు బాగా అల్లరిస్తున్నారు.