బిగ్ బాస్ సీజన్ 4 ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ లాగా ఉంది.. వారం మొదట్లో నామినేషన్ గొడవలు.. మధ్యలో కెప్టెన్సీ కోసం ఫోరు, అప్పుడప్పుడు రొమాంటిక్ లైన్లు..ఇక రాత్రి మాట చెప్పడమెందుకు లెండి మొత్తానికి రొమాన్స్ మయం అవుతుంది. ఇకపోతే ఇప్పుడు ఈ రోజు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే అందరిలో టెన్షన్ కన్నా ఎక్కువగా నువ్వా నేనా అనే ఆవేశాలు.. నన్ను ఎందుకు నామినేట్ చేశావ్ అంటూ కోపాలు.. ఎవరికీ అర్థం కావు.. మోనాల్ ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారీ ఏదోరకంగా సేవ్ అవుతుంది..
ఈరోజు నామినేషన్ కాస్త ఘాటుగా గొడవల మద్య జరుగుతుంది.. అయితే అఖిల్, అభిజిత్ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకున్నారు..దాంతో బిగ్ బాస్ మరో హైడ్రామా కు తెర లేపింది..అఖిల్-అభిజిత్ మధ్య ఉన్న వైరం రెట్టింపుఅయ్యింది. బ్రదర్ బ్రదర్ అని మాట్లాడుకున్నది.. చాక్లెట్లు ఇచ్చుకుని హగ్‌లు చేసుకున్నది నాటకం అని తేలిపోయింది. అయితే సోమవారం నాటి ఎపిసోడ్‌లో వీరిద్దరూ మళ్లీ దూషణలకు దిగారు. నువ్ ఎంత అంటే నువ్ ఎంత అనుకుంటూ ఒకరి లూప్ హోల్స్ ఒకరు బయట పెట్టుకుంటున్నారు.
సోమవారం నామినేషన్ హీట్ ఉండటంతో గుండెల్లో గుచ్చి మరీ నామినేట్ చేస్తున్నా. తమకు ఇష్టం లేని కంటెస్టెంట్ పేరు చెప్పి.. వాళ్ల మెడలో ఉన్న హార్ట్ సింబల్‌ని మేకుతో గుచ్చి నామినేట్ చేయాలని బిగ్ బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. అఖిల్, అభిజిత్‌ని నామినేట్ చేస్తూ చెలరేగిపోయాడు. మటన్ షాపు ఓనర్ మేకకి గడ్డి చూపించాడు. మేక లేపలికి వెళ్లిపోయింది. ఆ తరువాత ఏం కాలేదు అభిజిత్.. మేకను పులిగా బయటకు వదిలింది.ఏదో చిన్న పిల్లల కథల అఖిల్ కెప్టెన్ అవ్వడానికి పెద్ద యుద్దాలే చేశాడా అన్నట్లు ఉంది అతని ఓవర్ యాక్షన్..మొత్తానికి నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు కలిసి ఎపిసోడ్ ను రణ రంగంగా మార్చేశారు..ఈ గొడవలు పెరగడంతో ఇప్పుడు ఇద్దరు బయటకు వెళ్తారని అనుకుంటున్నారు.. కొందరేమో లాస్య వెళుతుందని అంటున్నారు.. ఏది ఏమైనా తెలియాలంటే ఈ వారం బిగ్ బాస్ ను తప్పక చూడాల్సిందే..