అతిథిగా వచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకంటూ యాంకర్ రవికి షాక్..!

Suma Kallamadi
బుల్లితెరపై తన అల్లరితో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తున్న యాంకర్ రవి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నువ్వుల పండగే. ఇక ఈ మధ్య కాలంలో యాంకర్ రవి కొత్త యాంకర్‌ వింధ్యతో కలిసి నువ్వు రెడీ నేను రెడీ అనే షోలో హోస్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. భార్యాభర్తలను గెస్ట్‌లుగా తీసుకొచ్చి వారితో ఆటాడించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే ఈ షో అనుకున్నట్టే బాగానే క్లిక్ అయింది. తాజాగా రవి జబర్దస్త్ షోలో గెస్ట్ అప్పియరెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మామూలుగా జబర్దస్త్ వేదిక మీద రవి అప్పుడప్పుడు కనువిందు చేస్తాడు. అయితే ఈ సారి రాకింగ్ రాకేష్ స్కిట్‌లో దువ్వాడ జగన్నాథం టైప్.. దువ్వాడ రవిగా ఓ పాత్రను ట్రై చేశాడు. ఎంట్రీ గ్రాండ్‌గానే ఇచ్చాడని తెలిపారు. కానీ అంతలోనే రష్మీ వేసిన పంచ్‌కు అంతా తుస్సుమంది. ఇక దువ్వాడ దువ్వాడ రవి అంటూ ఎక్స్ ట్రాలు చేస్తాడు. దానికి అవును నువ్ దువ్వేవాడివే కదా అంటూ రష్మీ కౌంటర్ వేస్తుంది రోహిణి.



ఇక జబర్దస్త్ స్టేజ్ మీదున్న కుర్చీని చూపిస్తూ సుబ్బరావు ఇంట్లో శుభకార్యం.. గంగారావు ఇంట్లో చావు కార్యం కూడా చేస్తారు. అయితే అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చింది అంటూ రవి డైలాగ్ వేస్తాడు. స్కిట్‌లో కంటెస్టెంట్ అయిన రోహిణి ఓ కౌంటర్ వేసింది. అవునను కొంత మంది అక్కడా ఇక్కడా తిరిగి ఇక్కడికే వస్తారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.

ఇక రోహిణి అలా అన్న మాటలో ఎంతో అర్థం ఉంది. మల్లెమాలలోని పటాస్‌ను వదిలి అదిరింది షోలోకి వెళ్లావ్.. మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చావ్ అన్నట్టుగా ఆమె వేసిన సెటైర్ బాగానే వేసింది. ఇలా అతిథిగా రావడం ఎందుకు ఆ గతాన్ని తవ్వుకుని పరుపు పోగొట్టుకోవడం ఎందుకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసింది ఆమె. ఇక అదిరిందిలో రవి పొజిషన్ బాగానే ఉందిగా అంటూ కామెంట్ల రూపంలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: