బుల్లితెర: నాగబాబును నవ్వించే దమ్ము మీలో ఉంటే ఈ గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!

Durga Writes

కామెడీ బాగా చేసి.. అందరిని పొట్టచక్కలు అయ్యేలా నవ్వించే వారికోసం.. జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ షో లలో చేయాలని ప్రయత్నించే వారికోసం నాగ బాబు ఓ అద్భుతమైన అవకాశాన్ని తీసుకువస్తున్నాడు. అది చూస్తే ఎవరైనా సరే.. వావ్ అంటారు. టాలెంట్ ఉండి అవకాశాలు లేనివారికోసం అంతటి అద్భుతమైన అవకాశాన్ని నాగబాబు ఇస్తున్నాడు. 

 

నాగబాబు త్వరలోనే రెండు కామెడీ షోలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా ఆ షోలకు సంబంధించిన పూర్తి వివరాలను నాగబాబు తెలియజేశారు. ఈ సందర్భంగానే తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడదల చేశాడు. ఇంకా ఆ వీడియోలో కడుపుబ్బా కామెడీ చేసి నవ్వించేంత దమ్ము ఉంటే వారికి ఓ అద్భుతమైన అవకాశం అంటూ పిలుపునిచ్చారు. 

 

నాగబాబు.. రెండు రకాల షోస్ చెయ్యాలని అనుకుంటున్నట్టు.. ఒక షో మంచి స్కిట్‌లు చెయ్యాలని, మరొక షో స్టాండప్ కామెడీ కాంపిటేషన్ పెట్టాలని అనుకుంటున్నట్టు అయన తెలిపారు. ప్రపంచంలో ఎంతోమంది స్టాండప్ కమెడియన్స్ ఉన్నారని కానీ తెలుగులో ఇంతవరకు అలాంటి స్టాండప్ కమెడియన్ ని చూడలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయన తెలిపారు. 

 

అంతేకాదు.. త్వరలోనే ఇద్దరు టాప్ కమెడియన్స్ ద్వారా ఈ షో పై అప్డేట్ ఇవ్వనున్నట్టు.. ఇంకా ఈ షోలో పాల్గొనేందుకు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, కామెడీ చెయ్యగల సత్తా మీలో ఉంటే నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ నాగబాబు తన వీడియోలో చెప్పుకొచ్చారు. మరి ఈ రెండు షోలు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్, అదిరింది షోస్ కి పోటీ ఇస్తాయేమో చూడాలి. 

 

 

అయితే ఈ ఛాన్స్ పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను ఆ వీడియో కింద కామెంట్లలో పంచుకుంటున్నారు.. ఈ షో ఎంతోమందికి మంచి అవకాశం అని.. ఈ అవకాశంతో ఎంతోమంది మంచి కమెడియన్లు మనకు పరిచయం అవ్వనున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి నాగబాబు ఇస్తున్నా ఈ అవకాశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ చేసి తెలపండి.  

" height='150' width='250' src="https://www.youtube.com/embed/7wsjk1TWMrM" width="697" height="392" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

 

అయితే ఈ ఛాన్స్ పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను ఆ వీడియో కింద కామెంట్లలో పంచుకుంటున్నారు.. ఈ షో ఎంతోమందికి మంచి అవకాశం అని.. ఈ అవకాశంతో ఎంతోమంది మంచి కమెడియన్లు మనకు పరిచయం అవ్వనున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి నాగబాబు ఇస్తున్నా ఈ అవకాశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ చేసి తెలపండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: