బుల్లి పిట్ట: ఐపీఎల్ ప్రియుల కోసం.. జియో సరికొత్త ప్లాన్స్..!!

Divya
టెలికాం దిగ్గజ సంస్థలలో రిలయన్స్ కూడా ఒకటి జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్తగా మూడు రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా డేటాను కూడా అందిస్తోంది. రూ.999 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 40 GB అదనపు డేటాను ఉచితంగా ఇస్తున్నదట. చాలామంది మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఐపిఎల్ మ్యాచ్ని చూసేందుకు మక్కువ చూపుతూ ఉండడంతో ఈ సీజన్ ఐపీఎల్ జియో సినిమాలో మాత్రమే ప్రసారం కాబోతున్నది. కాబట్టి జియో కొత్త ప్లాన్ ను లాంచ్ చేయడం జరిగింది.

ఐపీఎల్ సీజన్ 16వ మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31వ తేదీన జరగబోతున్నది.. ఐపీఎల్ ముందు జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్తగా మూడు కొత్త క్రికెట్ ప్లాన్లను ప్రారంభించింది.ఇందులో ప్రతిరోజు 3GP డేటా అందుబాటులో ఉంటుంది.. రూ.999 , రూ.399, రూ.219 వంటి మూడు ప్లాన్లు కలవు.. రూ.999 ప్లాన్ 84 రోజులపాటు ప్రతిరోజు 3GP డేటా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా కలదు. ఈ ప్లాన్ అదనంగా డేటాను కూడా ఇస్తుందట.

రూ.399, రూ.219 వంటి ప్లాన్లలో కూడా కస్టమర్లకు ప్రతిరోజు 3GP డేటాను అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందే సదుపాయం కలదు అయితే ఈ రెండు ప్లాన్లు వ్యాలిడిటీ వేరువేరుగా ఉంటుంది. రూ.399 కి 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అయితే ఉచితంగా 61GB డేటాను పొందవచ్చు. రూ.219 ప్లాన్ కు 2GB డేటా అదనంగా పొందవచ్చు దీని వ్యాలిడిటీ 14 రోజులు మాత్రమే కలదు. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఈ మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుచేతనే మొబైల్ డేటా ఎవరైనా సరే మ్యాచ్ చూడాలనుకునే వారికి క్వాలిటీ  ఆప్షన్ను కూడా ఎంచుకునే సదుపాయం కలదు అలాగే ఫుల్ హెచ్డి 4K క్వాలిటీలో కూడా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL

సంబంధిత వార్తలు: