బుల్లి పిట్ట: తక్కువ ధరకే HP ల్యాప్ ట్యాప్..!!

Divya
కరోనా సమయంలో ఎక్కువగా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కోసం ఎక్కువగా ట్యాబ్, ల్యాప్ ట్యాప్ , మొబైల్స్ వాటిని ఎక్కువగా వినియోగించారు. పలు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు కూడా స్టూడెంట్స్ కోసం తక్కువ ధరలకే ల్యాప్ ట్యాప్స్ ను అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా hp బ్రాండ్ కు చెందిన సరికొత్త ల్యాప్ ట్యాప్ ను తీసుకువచ్చింది. క్రోమ్ బుక్ పేరుతో ల్యాప్ ట్యాప్ అందిస్తోంది. hp CHROMEBOOK పేరుతో ఈ కొత్త ల్యాప్ ట్యాప్ తీసుకువచ్చింది.
స్కూల్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసినట్లుగా ఆ సమస్త వెల్లడించింది.INTEL కోర్ ప్రాసెస్ తో ల్యాప్ ట్యాప్ పనిచేస్తుంది ఎంతో స్టైలిష్ గా శక్తివంతంగా ఉంటుందని కంపెనీ తెలియజేస్తోంది ఎడ్యుకేషన్ తో పాటు గేమింగ్ సపోర్టు కూడా చేస్తుందట. ఇ ల్యాప్ ట్యాప్ ధర విషయానికి వస్తే దీని ధర.. రూ.28,999 ఉన్నట్లు నిర్ణయించింది ఆన్లైన్లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చట. ఇందులో 250 నీట్స్ పిక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వీడియో కాల్స్ కోసం వైడు విజన్ హెచ్ డి కెమెరా తో పాటు మైక్రోఫోన్ కూడా కలగట.

ఆడియో కోసం రెండు స్పీకర్లను అమర్చారు. ఈ ల్యాప్ ట్యాప్ ఒకసారి చార్జింగ్ చేస్తే 12 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ సంస్థ తెలుపుతోంది గూగుల్ అసిస్టెంట్ గూగుల్ క్లాస్ రూమ్ సర్వీస్ లకు ఈ ల్యాప్ ట్యాప్  సపోర్ట్ చేస్తుందట. ఫైల్స్ ఫోటోలను తొందరగా పంపించడానికి క్విక్ డ్రాప్ సదుపాయం కూడా ఉన్నదట. వేగవంతమైన వైఫై కోసం 6 అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బిగ్ కీబోర్డుతో పాటు ట్రాక్ ప్యాడ్ తో పాటు.. ప్లే స్టోర్ నుంచి కూడా నేరుగా ఆండ్రాయిడ్ యాప్ లను ఇన్స్టాల్ చేసుకుని సదుపాయం కలదట. ఎవరైనా అతి తక్కువ ధరకే ల్యాప్ ట్యాప్ కొనావాలనుకునే వారికి మంచి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: