బుల్లి పిట్ట: జియో రీఛార్జ్ ఆఫర్.. నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ ఉచిత సబ్ స్క్రిప్షన్..!!

Divya
అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ ఓటిటి ఉచిత సబ్స్క్రిప్షన్ బెస్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వారికి జియో తాజాగా కొన్నిటిని విడుదల చేయడం జరిగింది.అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్, ఓటిటి వాటిని సబ్స్క్రిప్షన్ పొందాలనుకునే వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో లేదు. ఈ సర్వీస్ కేవలం పోస్ట్ పైడ్ ప్లాన్ లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జియో యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటి కంటెంట్లను ఉచితంగా యాక్టివేషన్ చేసుకోవచ్చు.

Jio -399
జియో యొక్క రూ.399 ప్లాన్ తో ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటా కస్టమర్లకు అందిస్తుంది.అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 ఎస్ఎంఎస్ లిమిట్ కూడా కలదు ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటిని ఉచితంగానే సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఇక ఇందులో 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చట.

ఇక ఇదే లాభాలను ఆఫర్ చేసుకుని మరొక రెండు ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ మరియు అదనంగా సిమ్ కార్డు కూడా తీసుకువస్తాయట. ఇందులో రూ.599 రూపాయలకి పోస్ట్ పెయిడ్ ప్లాన్ కలదు.మరొకటి రూ 799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ కూడా కలదు. వీటిలో.. రూ.599 ప్లాన్ ఒక సిమ్ కార్డుతో వస్తుంది. రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మాత్రం రెండు అదనంగా సిమ్ కార్డులను తీసుకువస్తోంది. అయితే ఈ ప్లాన్ అన్నిటికీ కూడా అదనంగా జీఎస్టీని కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్స్ అన్నిటిలో కంటే ఎక్కువగా రూ.399 ప్లాన్ బెస్ట్ ప్లాన్ గా అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఓటీటిలో మూవీస్ చూడాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT

సంబంధిత వార్తలు: