బుల్లి పిట్ట: వాలెంటైన్స్ డే.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో..!

Divya
ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తన ప్లాన్లలో కస్టమర్లకు డేటాతో పాటు  ఉచిత కాలింగ్ వంటి సౌకర్యాలను అందించడం..  కూపర్ల రూపంలో ఇతర బంపర్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే ఆఫర్ అన్ని ప్లాన్లకు అందుబాటులో లేదు అని చెప్పవచ్చు..
మరి జియో వాలెంటైన్స్ డే ఆఫర్ ఏమిటి?  ఏ ప్లాన్ లపై వర్తిస్తుంది అంటే రిలయన్స్ జియో తన రూ.249, రూ. 899 , రూ.2,999 వంటి ప్లాన్ లపై మాత్రమే ఆకర్షణీయమైన వాలెంటైన్స్ డే ఆఫర్లను అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే వినియోగదారులు ఈ ప్లాన్ లపై గరిష్టంగా అదనంగా 12GB డేటాను కూడా పొందుతారు..ixigo నుండి జియో కస్టమర్లు రూ.4500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన విమానాలను బుక్ చేసుకుంటే రూ. 750 రూపాయల తగ్గింపు కూడా ఉంటుంది.
ఫేర్మ్స్ అండ్ పెటల్స్ నుండి ఫ్లవర్ బొకేలను ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గింపు కూడా లభిస్తుంది.  ఇదే కాకుండా జియో కస్టమర్లు మెక్ డోనాల్డ్ నుండి రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే 105 రూపాయల విలువైన ఆలూ టిక్కీ బర్గర్ తో పాటు మొదలైన వాటిని ఉచితంగా పొందవచ్చు. రూ.249 ప్లాన్ తో అపరిమిత కాలింగ్ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతిరోజు 2GB డేటా కూడా లభిస్తుంది.. ఈ ప్యాక్ 23 రోజులపాటు వ్యాలిడిటీ అందుబాటులో ఉండడమే కాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను కూడా పొందవచ్చు వీటితోపాటు జియో యాప్ లకు అన్నింటికీ కూడా యాక్సిస్ పొందవచ్చు.వాలెంటైన్స్ డే సందర్భంగా జియో అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జియో తన కష్టమర్లకు సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: