బుల్లి పిట్ట: మొబైల్ నీళ్లలో పడితే ఏం చేయాలి..?

Divya
ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా స్మార్ట్ మొబైల్ ని వినియోగిస్తూ ఉంటారు. మొబైల్ లేనిదే ప్రపంచం లేదు అనే అంతగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అయితే కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ స్మార్ట్ మొబైల్ నీళ్ళల్లో పడడం వంటివి జరుగుతూ ఉంటుంది.. లేదంటే వర్షం వస్తున్నప్పుడైనా ఏదో రకంగా తడిచే అవకాశం ఉంటుంది. అలా నీళ్లలో పడినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మన మొబైల్ ని పాడు చేసుకుంటూ ఉంటాము. మొబైల్ నీటిలో పడినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

మొబైల్ నీళ్లలో పడినట్లు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ని ఆన్ చేయకూడదు.. అలాగే ఎలాంటి బటన్స్ ను కూడా ఓత్తకూడదు. తడిచిన మొబైల్ ని గాలిని ఊదే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మొబైల్ లోపల భాగంలో నీరు వెళ్లే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హీట్ డ్రైయర్ ను ఉపయోగించకూడదు. కొద్దిసేపటి తరువాత మొబైల్ ని ఆన్ చేసి సిమ్ము కార్డులను తొలగించాలి.. ఏదైనా క్లాత్ ద్వారా పేపర్ ద్వారా తడిసిన ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయాలి. తడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కాసేపు పొడి బియ్యం లో ఉంచాలి.. ఇలా ఉంచడం వల్ల మొబైల్ లో ఉండే తేమ మొత్తం హావిరవుతుంది.

ఇలా రెండు రోజుల పాటు ఉంచినట్లు అయితే మొబైల్ లో ఉండే తేమ అంతా పోవడం వల్ల మొబైల్ రన్ అవుతుంది. ముఖ్యంగా మొబైల్ ని వినియోగించే వారు తక్కువ ధరకే మొబైల్ కవర్లు పలు ఈ కామర్స్ దిగ్గజ సంవత్సరాల దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల వర్షం లో తడిచిన నీటిలో పడ్డ మొబైల్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు. మొబైల్ నీటిలో పడిన వెంటనే డ్రైయర్ తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ  శుభ్రం చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: