బుల్లి పిట్ట: ఆవు పేడతో నడిచే ట్రాక్టర్..!!

Divya
రానున్న రోజుల్లో టెక్నాలజీ మరింత పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు దిగ్గజ ఎలక్ట్రిక్ సంస్థలు. అయితే ఇప్పుడు తాజాగా గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దే వైపుగా శ్రీకారం చుడుతున్నారు బ్రిటన్ కు చెందిన ఇంధన సంస్థ. అది కూడా ఆవు పేడతో నడిచే 270 హార్స్ పవర్ కలిగిన t-7 లిక్విడ్ మిథైన్ కింద ట్రాక్టర్ ను ఆవిష్కరించబోతున్నారు. ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయానికి సరికొత్తగా విప్లవాత్మక మార్పులను చేసేందుకే బ్రిటన్ కంపెనీ ఆవుపేడతో నడిచేటువంటి ఒక ట్రాక్టర్ ను ఆవిష్కరించింది. సాధారణ  డీజిల్ ఇంజన్లకు దీటుగా ఈ ట్రాక్టర్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేస్తుందని కంపెనీ బెనయన్ తెలియ చేస్తోంది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు క్రిస్ మాన్ పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ మెరుగైన సామర్థ్యంతో కూడిన ఈ ట్రాక్టర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆవిష్కరణ చేపడుతామని తెలియజేశారు. కాన్ వాల్ కౌంటిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్రాక్టర్ ను ట్రయల్ నిర్వహించినట్లుగా తెలియజేశారు.
కార్బన్డయాక్సైడ్ వాయువులు ఏడాదిలో 2500 మెట్రిక్ టన్నుల నుంచి 500 మెట్రిక్ టన్నులకు తగ్గిస్తాయని తెలియజేశారు. డీజిల్ తరహాలోనే అదే స్థాయిలో ఈ ట్రాక్టర్ క్రమోజనిక్ ట్యాంక్ పవర్ను అందిస్తుందని దీనివల్ల కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆ కంపెనీ సమస్త తెలియజేస్తోంది. ఈ కంపెనీ గత మోడల్ t-6 మీథేన్ పవర్ సిఎస్జి ట్రాక్టర్ తో పోలిస్తే ఏ ట్రాక్టర్ ఇందన సామర్థ్యం నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని బెన్ మన్ తెలియజేసింది. T-7 మిథైన్ పవర్ ఎల్ ఎన్ జి ట్రాక్టర్ నాన్ వెంటింగ్ క్రమోజనిక్ స్టోరేజ్ ట్యాంక్ మీద లిక్విడ్ ను మెయింటైన్ చేస్తూ క్లీన్ పవర్ నూతన వరుసగా సేద్యం రంగం వైపుకు తీసుకువచ్చిందట. ఇక ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: