బుల్లి పిట్ట: రెడ్మీ నోట్ 12 సిరీస్ ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే..?

Divya
రెడ్మీ నోట్ సిరీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ మార్కును అధిగమించిందని.. ఇది అత్యంత ప్రజాధరణ పొందిన స్మార్ట్ ఫోన్ సీరీస్ లో ఒకటిగా మారిపోయింది అని.. తాజాగా షియోమీ ఇండియా ఇటీవల ప్రకటించింది. ఈ సంఖ్యలో 72 మిలియన్లు భారతదేశంలోని విక్రయించబడ్డాయి.  అంతేకాదు భారతదేశంలో అత్యంత ప్రశంసలు పొందిన అలాగే అత్యంత ప్రజాదారణ పొందిన ఈ రెడ్ మీ నోట్ సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. షియోమీ కొత్తగా రెడ్మీ నోట్ 12 సిరీస్ ను జనవరి 5 2023న ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోనే లాంచింగ్ డేట్ ను కూడా ప్రకటిస్తూ మరికొన్ని విషయాలను వెల్లడించింది.
భారతదేశంలో ఈ సిరీస్ లో మూడు మోడల్స్ రెడ్ మీ నోట్ 12 5g,  రెడ్మీ నోట్ 12 ప్రో 5g,  రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5g ఫోన్లు ఉంటాయి. ఈ కొత్త రెడ్మి నోట్ హార్డ్వేర్ విభాగంలో గణనీయమైన అప్ గ్రేడ్లను తీసుకువచ్చినప్పటికీ కూడా రెడ్మి నోట్ 12 సిరీస్ లోని క్లాసిక్ వేరియంట్ 5జి కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి.120Hz రిఫ్రేష రేటుతో ఏమోలేడ్ డిస్ప్లే మరియు స్నాప్ డ్రాగన్ ఫోర్ జెన్ వన్ ప్రాసెసర్ యొక్క పవర్ ప్యాక్డ్ కాంబోతో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతోంది. 200 మెగాపిక్సల్ కెమెరా సెట్ అప్ తో సాంసంగ్ తో సహా అభివృద్ది చెందిన ఎక్స్ పి ఎక్స్ సెన్సార్ ను భారతదేశానికి పరిచయం చేస్తోంది.
6.67 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 33 బ్యాట్ ఇన్ బాక్స్ పాజిటివ్ ఛార్జర్ తో పాటు 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీకి మద్దతు ఇస్తుంది.  ట్రిపుల్ కెమెరా కలిగిన ఈ ఫోన్లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 8 మెగా ఫిక్స్ఎల్ అల్ట్రా వైడ్ అలాగే 2  మెగాపిక్సల్ మైక్రో సెన్సార్ తో వస్తుంది అలాగే సెల్ఫీ కోసం 13 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: