బుల్లి పిట్ట: రెడ్మీ నోట్ -12 సిరీస్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ ఇవే..!!

Divya
అది తక్కువ ధరకే తమ కస్టమర్ల కోసం ఎన్నో మొబైల్స్ ను విడుదల చేసింది రెడ్ మీ సంస్థ. ముఖ్యంగా ఈ మొబైల్స్ గడచిన కొన్ని సంవత్సరాలనుంచి ఎక్కువగా మార్కెట్లోకి విడుదలవుతూ ఉన్నాయి. తాజాగా సరికొత్త స్మార్ట్ మొబైల్ ని షియోమి ప్రవేశ పెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. భారతదేశంలో అత్యంత ప్రశంసలు పొందిన బ్రాండ్ గా పేరు షియోమి. అయితే తాజాగా redmi note -12 సిరీస్ గల మొబైల్ ని వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ సూపర్ నోట్ సిరీస్ ఫ్యూచర్ ఉంటుందని బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ మొబైల్స్ ను మూడు మోడల్స్ లో..REDMI NOTE 125G,REDMI NOTE 12 PRO 5g,REDMI NOTE 12 PRO+5G వేరియంట్ మొబైల్ ని విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ లకు హార్డ్వేర్ విభాగంలో ఒక సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 12 సిరీస్ లో క్లాసిక్ వేరియంట్ ఫైవ్ జి కనెక్టివిటీ మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 4 GEN 1 ప్రాసస్ యొక్క పవర్ ప్యాక్డ్ కాంబో ని కలిగి ఉంటుందట. ఇక సోనీ IMX766 సెన్సార్ ని కలిగి ఉన్న ఐఓఎస్ కెమెరాను కలిగి ఉంటుందట. ముఖ్యంగా 200 mp కెమెరా సెట్ అప్ తో సాంసంగ్ తో సహా అభివృద్ధి చేసిన HPX సెన్సార్ ను భారత్ లోకి పరిచయం చేస్తోంది.

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే .. రెడ్మీ నోట్ 12 5g మొబైల్..6.67 అంగుళాల డిస్ప్లేతో 5జి డ్యూయల్ బ్యాండ్ సపోర్టుతో పని చేస్తుంది.5000 MAH సామర్థ్యం గల బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. ఇక ఇందులో 48 mp మెగా పిక్సెల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 13 మెగాపిక్సల్ కలదు.

రెడ్మీ నోట్ 12 ప్రో 5G:
ఇక ఈ మొబైల్ 5000 MAH సామర్థ్యం బ్యాటరీ తో పాటు 67 W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుందట అలాగే 50 mp సోనీ కెమెరాతోపాటు IOS సిస్టం కూడా కలదట. సెల్ఫీ ప్రియుల కోసం 16 mp మెగాపిక్సల్ కలదు . ఇక వీటితో పాటే రెడ్మి నోట్ 12 PRO+ 5g మొబైల్ లో కూడా పలు రకాలుగా అప్డేట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ధరల విషయంలో కూడా రూ .20000 నుంచి మొదలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: