టూత్ పేస్ట్ వాడుతున్నారా? వామ్మో ఈ నిజం తెలుసుకోండి?

పూర్వకాలంలో దంతాలను శుభ్రం చేసుకోవడానికి బొగ్గును, వేప పుల్లను ఉపయోగించే వారు. వీటిని ఉపయోగించడం వల్ల వారు చక్కటి దంతాలను కలిగి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోయాకా వాటి వాడకం తగ్గి క్రమేనా టూత్ పేస్ట్ లను వాడడం ఎక్కువైంది. మనకు మార్కెట్ లో రకరకాల టూత్ పేస్ట్ లు లభ్యమవుతూ ఉంటాయి. వాటిలో ఏది రసాయనాలు కలిగి ఉందో ఏది సహజ సిద్దమైందో చాలా మందికి తెలియదు. తెల్లగా ఉండే టూత్ పేస్ట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల మన దంతాలపై ఒక పొరలాగా ఏర్పడి దంతాల అరుగుదలను నివారించే విషయంలో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. టూత్ పేస్ట్ ల కింది భాగంలో ఎరుపు, నలుపు, బ్లూ, ఆకుపచ్చ రంగుల్లో గుర్తులు ఉంటాయి.టూత్ పేస్ట్ కింది భాగంలో నలుపు రంగులో గీత ఉంటే అది వంద శాతం రసాయనాలతో తయారు చేసారని అర్థం. ఆ గీత ఆకుపచ్చ రంగులో ఉంటే టూత్ పేస్ట్ వంద శాతం సహజ సిద్దమైందని అర్థం. నీలి రంగులో గీత ఉంటే ఆ టూత్ పేస్ట్ ను సహజసిద్దమైన మెడికల్ పదార్థాలను కలిపి తయారు చేసారని అర్థం.


ఒకవేళ గీత ఎరుపు రంగులో ఉంటే ఆ టూత్ పేస్ట్ ను సహజసిద్దమైన రసాయనాలతో తయారు చేసారని అర్థం చేసుకోవాలి. టూత్ పేస్ట్ వల్ల థైరాయిడ్ సమస్యలు కలుగుతాయని అనగానే చాలా మంది ఇది నిజం కాదు అని భావిస్తారు. కానీ క్రిములను నాశనం చేసే టూత్ పేస్ట్ లలో ట్రిక్లోసన్ అనే రసాయనాన్ని కలుపుతారు.ఈ రసాయనాన్ని పురుగు మందుల్లో వాడే వారు. ఈ రసాయనాన్ని కలిగి ఉన్న టూత్ పేస్ట్ లను వాడడం వల్ల థైరాయిడ్ సమస్య, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉపయోగించాలి. టూత్ పౌడర్ ను వాడే వారు అది మెత్తగా ఉండేలా చూసుకోవాలి. మంచి కంపెనీ, బ్రాండ్ ఉన్న టూత్ పేస్ట్ లను ఉపయోగించాలి. టూత్ పేస్ట్ రంగు, రుచి, వాసనకు బదులుగా దాని పనితీరు చూసి కొనుగోలు చేయాలి. ఆహారం తీసుకునే సమయంలో దంతాలు జివ్వుమన్నట్టు ఉంటే మెడికేటెడ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: