బుల్లి పిట్ట: మీ కారు మైలేజ్ రావడం లేదా.. అయితే ఒకసారి ఇలా చేయండి..!!

Divya
ప్రతి ఒక్కరు కూడా తమ కారు బాగా మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో చాలా చైతన్యం ఏర్పడింది. ఇక కార్ల సంస్థలు కూడా మైలేజ్ ఎక్కువగా వచ్చే విధంగా తమ కార్లను తయారు చేసేందుకు దృష్టి సాధిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో కార్లను వినియోగించేవారు ఎక్కువ ధరతో పాటు మైలేజ్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. అయితే ప్రస్తుతం BS-4,BS-6 కార్ల ను కాలుష్య నియంత్రణ ఉండే విధంగా తయారు చేస్తున్నారు. అయితే కొన్ని పద్ధతులను పాటించడం వల్ల కార్లు మైలేజ్ పెంచుకోవచ్చును. వాటి గురించి చూద్దాం.
1). ముందుగా మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ సీ ఆన్ లో  ఉంచకూడదు. ఎందుకంటే AC రన్ చేయడం వల్ల కార్ మైలేజ్ 30 శాతం వరకు తగ్గిపోతుంది.
2). కారు పనితీరును బట్టి రెగ్యులర్గా సర్వీస్ చేయించడం చాలా అవసరం. ఇది మంచి మైలేజీ ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. టీం ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ ను క్లీన్ చేస్తూ ఉండడం వల్ల ఇంధన మైలేజ్ పెరుగుతుంది.
3). మూడవది మనం చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే.. ఎక్కువ దినాలకు ఫుల్ ట్యాంక్   పట్టిస్తూ ఉంటారు. అయితే ఇలా పట్టించడం చాలా మైలేజ్ తగ్గిపోవడానికి కారణం అవుతుందట. ఎందుకంటే ఇంధన లోడ్ ఎక్కువ అయినప్పుడు మైలేజ్ తక్కువ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
4). మనం డ్రైవ్ చేసే కార్ లోనే టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైర్లలో ఉండాల్సిన గాలి తక్కువగా ఉన్నట్లు అయితే రన్నింగ్ రోడ్డు పెరిగి మైలేజ్ తగ్గుతుంది.
5). మితిమీరిన వేగంగా వెళ్లకుండా.. ఆ సందర్భాలలో బ్రేక్ లను వేయకుండా ఉండడంవల్ల ఇంధనం మైలేజ్ పెరుగుతుంది. హైవేల పైన ఎక్కువగా వేగంతో వెళ్ళినట్లయితే 30 శాతం వరకు మైలేజ్ కోల్పోతాము. సిటీ రోడ్లలో అనవసరంగా బ్రేకులు వేయడం వల్ల 5% మైలేజ్ ను కోల్పోతాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: