బుల్లి పిట్ట: మొబైల్ వేగాన్ని పెంచే అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసా..?

Divya
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ప్రపంచం యొక్క రూపురేఖలను మార్చివేసింది. అరచేతిలోనే ప్రపంచమంతా చూపించే టెక్నాలజీ అందుబాటులోకి రావడం గమనార్హం. ఏం చేయాలన్నా సరే .. ఏం చూడాలి అన్నా సరే మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మనిషి శరీరంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగమై పోయింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. రోజుకి వీటి వినియోగం కూడా బాగా విపరీతంగా పెరిగిపోతోంది మొత్తంగా చూసుకుంటే కేవలం మనదేశంలోనే 1.2 బిలియన్ మంది వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అంతర్భాగం అయిపోయింది. ఇక 24 గంటల పాటు ఈ మొబైల్ ను ఉపయోగించడం వల్ల ఒక్కసారిగా మొబైల్ ఫోన్ పనిచేయడం మందగిస్తుంది. ఫోన్ పనితీరు మందగించినప్పుడు వేగవంతంగా పని చేయడం కూడా కుదరదు. ఉన్నట్టుండి ఫోన్ స్లో గా మారడానికి గల కారణం ఏమిటి..?  తిరిగి ఆ ఫోన్ వేగంగా పని చేయాలంటే ఏం చేయాలి..?  ఎలాంటి చిట్కాలు పాటించాలి..?  అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరిలో సందేహంగా మారిపోయాయి. అది ఎలాగో ఇప్పుడు మనం కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం.

మీరు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి అక్కడ ఏమైనా అప్డేట్ చేయవలసిన యాప్స్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఇక ఎక్కువ స్టోరేజ్ ని ఆక్రమించే గ్రాఫిక్స్ గేమ్స్ ను కూడా వాడకపోవడం చాలా మంచిది. మీరు మీ మొబైల్ లో ఉపయోగించని అప్లికేషన్లను అలాగే యాప్ లను డిలీట్ చేయడం ఉత్తమం. ఇక అవసరమైన అప్లికేషన్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.. అనవసరమైన ఫోటోలు, వీడియోలను కూడా డిలీట్ చేయడం మంచిది. వాట్సప్ కి తరచూ వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లు,  ఫొటోలు,  వీడియోలను తొలగించి ఎప్పటికప్పుడు ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ వుండేలా చూసుకోవాలి. ఇంటర్నల్ స్టోరేజ్ అప్లికేషన్ లతో పాటు కాంటాక్ట్ కాల్స్,   మెసేజ్లు ఇలా వీటన్నింటినీ అవసరం లేకపోతే డిలీట్ చేయడం ఉత్తమం. ఇక మీరు  కనుక ఈ టిప్స్  ఫాలో చేస్తే తప్పకుండా మీ మొబైల్ పనితీరు వేగవంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: