చైనాకు ఇక చుక్కలే.. భారత ఆర్మీలో దడ పుట్టించే కొత్త ఆయుధాలు..!

MOHAN BABU
చైనాకు ఇక చుక్కలే. ఇండియా పక్కకు చూడాలన్నా దిక్కులే. బార్డర్లో దుందుడుకుగా ముందుకు వస్తూ రాడ్లు, కర్రలతో అటాక్ చేస్తున్న చీనీ ఆర్మీకి చింతపండు పడేలా ఇండియన్ ఆర్మీ చేతికి సరికొత్త ఆయుధం జతైయింది. శివుని చేతిలో త్రిశూలాస్త్రం, ఆర్మీ చేతిలోని అమ్ములపొద కి చేరింది. అంటే మామూలు త్రిశూలం కాదు  అనేక ప్రత్యేకతలున్న త్రిశూలం. టచ్  అయితే చాలు చైనా సైనికులకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. సరిహద్దుల్లో తుపాకులను పేల్చ కూడదని ఇండియా, చైనాల మధ్య ఒప్పందం ఉంది. కానీ నక్కజిత్తుల చైనా సైన్యం   ఇనుప రాడ్లు, ఇనుప ముళ్ళు, షాక్ తగిలించే టేజర్లతో అటాక్ చేసింది. తూర్పు లడక్, గాల్వన్ లోయ లో ఇలాగే రెచ్చిపోయింది. చైనా టక్కుటమార విద్యల తో శాంతి శాంతి అనుకుంటూ ఉంటే సరిపోదని అనుకున్న ఇండియన్ ఆర్మీ ప్రాణ హాని కలిగించని ఆయుధాల పై దృష్టి పెట్టింది. త్రిశూల ఆయుధం బ్యాటరీ సాయంతో వర్క్ చేస్తుంది. దీంతో ఒకటిచ్చామంటే చైనీస్ సోల్జర్ కు బాడీలో కరెంటు ప్రవహించి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. షాక్ తగిలిన వెంటనే స్పృహతప్పి గిలగిల కొట్టుకుంటాడు.

 వజ్ర మెటల్ రాడ్ తో శత్రువు అపస్మారక స్థితిలోకి జారిపోతాడు. దీనిపై ముళ్ళు లాంటివి కూడా ఉంటాయి. చైనా వాహనాలను కూడా ధ్వంసం చేయగలదు వజ్ర మెటల్ రాడ్. ఒకవేళ చైనా లేదా పాక్ సైనికుడు దీన్ని లాక్కొని పోయినా అది వారికి పనిచేయదు. భద్ర శీల్డ్ ద్వారా దీన్ని వాడొచ్చు. రాళ్ల దాడి నుంచి మన సైనికుడిని సేవ్ చేస్తుంది భద్ర షీల్డ్. ఇది కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని కూడా రిలీజ్ చేస్తుంది. ఫలితంగా శత్రు సైనికుడికి కొద్దిసేపు కళ్ళు కనిపించవు. దీనిని తాకితే ప్రత్యర్థికి షాక్  తప్పదు. చైనా సైనికులు సంప్రదాయ ఆయుధాలు పడుతున్నట్లుగా మన సైనికులు కూడా సంప్రదాయ ఆయుధాలను తయారు చేయించి వాటిని వాడుతున్నారు. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా, ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా వీటిని తయారు చేశారు. వీటిద్వారా శత్రువులను చాలా వేగంగా తిప్పికొట్టే శక్తిసామర్థ్యాలు భారత సైన్యానికి వస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: