క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అంటే ఏంటి ?

Vimalatha
క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు అనే పదాలను తరచూ వింటూ ఉంటాము. మనలో చాలా మంది వాడతారు కూడా. వాడినప్పటికీ అసలు డెబిట్ కార్డు అంటే ఏంటి ? క్రెడిట్ కార్డు అంటే ఏంటి? అనే విషయం ఎంత మందికి తెలుసు ? ఎవరైనా బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు వారి సౌకర్యార్థం చెక్ బుక్, పాస్‌బుక్ ఇంకా ఏటిఎం కమ్ డెబిట్ కార్డ్ ఇస్తాయి బ్యాంకులు. మీ ఖాతాకు కొంత సమయం వచ్చినప్పుడు, బ్యాంక్ క్రెడిట్ కార్డును కూడా అందిస్తుంది. అయితే డెబిట్ కార్డు దేనికి? క్రెడిట్ కార్డు దేనికి అనే విషయంలో చాలా మంది అయోమయంలో ఉన్నారు. కానీ ఈ రెండు కార్డులు ఏంటి? వాటి ప్రయోజనం ఏంటి? అనే విషయాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.
డెబిట్ కార్డ్ అంటే ఏమిటి?
డెబిట్ కార్డ్ అనేది మీ సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన కార్డ్. మీరు బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు బ్యాంక్ ఈ కార్డును జారీ చేస్తుంది. దానిని మీరు ATM మరియు POS టెర్మినల్స్ వద్ద డబ్బు తీసుకోవడానికి లేదా మీ ఖర్చులకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు. మీ డెబిట్ కార్డ్ నుండి ఆటోమేటిక్‌గా, తక్షణమే మొత్తం అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది లేదా కట్ అవుతుంది. బ్యాంకులు ఉచిత డెబిట్ కార్డులను అందిస్తాయి. చిన్న వార్షిక నిర్వహణ అమౌంట్ ను కూడా వసూలు చేస్తాయి.
క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి మీరు డబ్బు తీసుకోవడానికి మరొక రకం కార్డు. బ్యాంకు దానిలో క్రెడిట్ పరిమితిని కూడా పెడుతుంది. ఈ పరిమితి మీ ఆదాయం ఆధారంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పెరుగుతుంది. బ్యాంక్ మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను బిల్లు చేస్తుంది. మీరు దానిని గడువు తేదీలోగా చెల్లించాలి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ రుణాన్ని చెల్లించలేకపోతే, బ్యాంకు తీసుకున్న డబ్బుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: