బుల్లిపిట్ట: వారానికొకసారి ఇలా చేస్తేనే మీ మొబైల్ సేఫ్ గా ఉంటుంది....

Divya
ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా మొబైల్ లో వినియోగం ఎక్కువగానే ఉంది. ఇక ఈ మొబైల్స్ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. అంతే కాకుండా ఎక్కువగా హ్యాకర్ల బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు ఇటీవల ఒక సైబర్ సంస్థ తెలిపింది. ఇక రీసెంట్ గా రాజకీయ నాయకుల మొబైల్స్ ను కూడా హ్యాక్ చేయడం జరిగింది అన్నట్లు వార్తలు విన్నాము. అయితే మన మొబైల్ ని ఇలా హ్యాక్ కాకుండా ఉండేందుకు ఒక పని చేస్తే చాలట.

సైబర్  నేరగాళ్ల బారి నుండి మనం తప్పించుకోవాలి అంటే.. భువనగిరి నేషనల్ సెక్యూరిటీ సంస్థ వారు ఫోన్ వినియోగదారులకు కొన్ని సలహాలను తెలియజేశారు. అవేమిటంటే, మొబైల్ లోకి వచ్చే టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా, వాట్సాప్ లో వచ్చే కొన్ని లింకులను క్లిక్ చేయడం ద్వారా ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారినపడే అవకాశం ఉంటుంది. అందుచేతనే వాటిని మనం డిలీట్ చేస్తే మేలట.
కేవలం మనకి ఆఫర్ల కింద వీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది . అలాంటివి నమ్మకుండా మోసపోకుండా ఉండాలి. ఇక అంతే కాకుండా ప్రతి ఒక్కరి మొబైల్ ను  వారంలో ఒక్కసారైనా reboot చేయడం, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం వంటివి చేయడం వలన మన ఫోన్ లలో ఉన్న సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల బారిన పడకుండా సేఫ్ గా ఉంచుకోవచ్చు.
ఇలా చేస్తే మొబైల్ హ్యాకర్ల బారిన పడే అవకాశం లేదని నేషనల్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఇకనైనా ఈ విషయం తెలుసుకోకుంటే, ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరూ రీబూట్ చేయవలసిందిగా తెలిపింది. ఇది కేవలం పెద్ద పెద్ద  హ్యాకర్ల  బారి నుండి కాపాడుకో లేకపోయినా, చిన్నచిన్న సైబర్ నేరగాళ్ల కంట పడకుండా ఉండవచ్చని తెలిపింది. దీని ద్వారా మన మొబైల్ కు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: