గోధుమ నారు దాచుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

Divya

గోధుమలు ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషక పదార్థాలను, ఫైబర్ లను అందిస్తాయని మనందరికీ తెలుసు.  అయితే "ఈర్ఫ్ థామస్ "అనే పరిశోధకుడు 4700 రకాల గడ్డిపరకలను పరిశీలించి, ముఖ్యంగా గోధుమ నారు లో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని తేల్చాడు. గోధుమ నారు లో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ తో పాటు ఎన్నో రకాల ఎంజైములు కూడా పుష్కలంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

 క్యారెట్లో కన్నా ఎక్కువ విటమిన్ ఏ, కమలాలలో ఉన్న ఎక్కువ విటమిన్ సీ కన్నా ఎక్కువగా ఈ విటమిన్స్ గోధుమ నారులో  ఉన్నాయి.  సంపూర్ణ ఆహారం అనదగిన అన్ని ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి.  అంతేకాకుండా చర్మానికి పోషణ, కాంతి, రంగు ఇవ్వడంతో పాటు జుట్టు నల్లగా,ఒత్తుగా పెరగడానికి దోహదం చేస్తుంది. అయితే ఇన్ని పోషకాలు ఉన్న గోధుమ నారు  ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 గోధుమ నారును శుభ్రం చేసి,దంచి రసం తీయాలి.  ఇక ఈ రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే 20 నిమిషాల్లో శరీరంలో ఇమిడిపోతుంది.
గోధుమ నారు రసం తాగలేని వారు,కూరల్లో,పచ్చళ్ళ లో, కొత్తిమీర,పుదీనా వంటి వాటితో గోధుమ నారు ను కలిపి తీసుకోవచ్చు.
కొన్ని వాత వ్యాధులలో, మోకాలు జాయింట్లు వ్యాధులతో కండరాలు బాగా దెబ్బతిని ఉంటాయి. జాయింట్స్ కు లింఫ్ సరఫరాలో అడ్డుపడే మ్యూకస్ ని బ్రేక్ చేసి,జాయింట్ ని మళ్ళీ  నిలబెట్టేందుకు గోధుమ నారు అద్భుతంగా పనిచేస్తుంది.
గోధుమ నారు ని  పెంచలేని వారు,లేదా తినలేని వారు కనీసం నాలుగైదు రోజుల వయసున్న గోధుమ మొలకలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
గోధుమ మొలకలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇలాంటి జబ్బులతో ప్రాణాపాయ స్థితిని తపిస్తూ, శరీరంలో విషాలను తొలగించి, అద్భుతమైన పోషణ ఇచ్చే ఇలాంటి ప్రకృతి ప్రసాదాన్ని తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది.
గోధుమ నారు తీసుకోవడం వల్ల రక్తపోటు నెమ్మదిస్తుంది. ఎర్రరక్తకణాల తీరు అభివృద్ధి చెంది, రక్తహీనత నుంచి బయటపడవచ్చు. మధుమేహం ఉన్న వారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: