బుల్లిపిట్ట: లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ ఫోటోలు... స్పెసిఫికేషన్లు ఇవేనా?

Suma Kallamadi
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ కి సంబంధించిన ఫోటోలను ఇవాన్ బ్లెస్ అనే ఒక వ్యక్తి ఇంటర్నెట్లో లీక్ చేశాడు. ఐతే ఇప్పటివరకు ఇవాన్ బ్లెస్ విడుదల చేసిన స్మార్ట్ ఫోనుల రెండెర్స్ అన్ని కూడా నిజమైనవే అని తెలిసింది. దీంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ డిజైన్ పైఫోటో ఉన్న మొబైల్ లాగానే ఉంటుందని తెలుస్తోంది. ఫోటోలో స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపున దీర్ఘచతురస్రాకారంలో 3 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇంతకు ముందు విడుదలైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లకు గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ కెమెరా సెటప్ చాలా భిన్నంగా ఉన్నట్టు ఫోటోలో కనిపిస్తుంది.

ఫోన్ లో ఉన్న 3 సమర్థవంతమైన కెమెరా సెన్సార్లు స్పష్టమైన ఫోటోలను, వీడియోలను చిత్రీకరిస్తాయని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ తో పోల్చుకుంటే గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ కెమెరా సెట్ ఉబ్బెత్తుగా లేదని తెలుస్తోంది. అలాగే సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ మెటాలిక్ అంచులతో డిజైన్ చేయబడిందని తెలుస్తోంది. మొబైల్ ముందు భాగంలో స్క్రీన్ మధ్యలో ఒక పంచ్ హోల్ కెమెరా అమర్చినట్టు కనిపిస్తోంది. మొత్తంమీద శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ ఇప్పటి వరకు విడుదలైన శాంసంగ్ ఎస్20 ఫోన్ల లాగానే ఉందని స్పష్టమౌతుంది.

గీక్ బెంచ్ వెబ్ సైట్ లో పొందుపరిచిన జాబితాలో  శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పాటు 6 జిబి ర్యామ్‌తో లభించనుందని వెల్లడించింది. ఎక్సినోస్ 990 వేరియంట్ లో లభించనున్న గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ 8 జిబి ర్యామ్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ మరిన్ని వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ ప్రీమియం గెలాక్సీ ఫోన్‌లకు చౌకైన ప్రత్యామ్నాయంగా లభించనున్నదని తెలుస్తోంది.  నివేదికల ప్రకారం, దీని ధర రూ.56,700 ఉంటుందని తెలుస్తుంది. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ మొబైల్స్ మొదట దక్షిణ కొరియాలో విడుదలవనున్నాయి. గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ పింక్, ఎరుపు, ఆకుపచ్చ, బంగారం వంటి రంగులలో లభించనున్నది. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.4-అంగుళాల AMOLED డిస్ప్లే తో లభించే గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ లో వీడియోలు చూడ్డానికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: